అనంతపురం: అనంతపురం జిల్లాలోని ట్రెజరీలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ మనోజ్ ఆస్తుల విషయం బయటకు రావడానికి భార్యభర్తల మధ్య గొడవలే కారణమయ్యాయి. చిన్న విషయం పెద్దదిగా మారి మనోజ్ కు చెందిన ట్రంకు పెట్టెలు బయటపడ్డాయి.

ట్రెజరీ శాఖలో మనోజ్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు.  ఇటీవల కాలంలో మనోజ్ కు ఆయన భార్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు తారాస్థాయికి చేరుకొన్నాయి.. భార్య బంధువులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును  కూడ పెట్టారు.భార్య తరపు బంధువులపై మనోజ్ తరపున నాగలింగం తుపాకీతో బెదిరించాడునాగలింగం వద్ద తుపాకీ ఉందని మనోజ్ భార్య బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.మనోజ్ వద్ద నాగలింగం డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నాగలింగాన్ని ప్రశ్నించారు. తుపాకీ విషయమై ప్రశ్నించారు. నాగలింగం ఆ తుపాకీని తన మామ బాలప్ప ఇంట్లో దాచిపెట్టాడు. ఇదే ఇంట్లో మనోజ్ కు చెందిన ట్రంక్ పెట్టెలు దాచిపెట్టారు. ఈ ట్రంకు పెట్టెల్లోనే తుపాకీని దాచిపెట్టారు.

తుపాకీ కోసం నాగలింగంతో పాటు బాలప్ప ఇంట్లో సోదాలు నిర్వహిస్తే ట్రంక్ పెట్టెలు బయటపడ్డాయి. ఈ ట్రంక్ పెట్టెల్లో 2.4 కిలోల బంగారం, వెండి, భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

Also read:2.4 కిలోల బంగారం, భారీగా నగదు: అనంతపురం ట్రెజరీ ఉద్యోగి ఆస్తుల గుర్తింపు

తుపాకీ కోసం సోదాలు చేస్తే మనోజ్ కు దాచిన బంగారం, వెండి, ఆస్తుల చిట్టా వెలుగు చూసింది. ఈ డబ్బులు, బంగారం, వెండి ఎక్కడి నుండి సంపాదించారనే విషయమై దర్యాప్తు చేయాలని సంబంధిత అధికారులకు పోలీసులు  లేఖను పంపనున్నారు.