కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు  రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం మీద పోలీసులు ఆరా తీస్తున్నారు.

పాణ్యం మండలం కొల్లూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రైల్వే ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

మృతులను రోజాకుంటకు చెందిన గఫూర్ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. అతను ఓ బంగారం దుకాణంలో పనిచేసేవాడు. ఆ దుకాణంలో చోరీ జరిగింది. అది అతని మీద పడడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు.