భర్త వేధింపులు తట్టుకోలేక.. ఓ ఉపాధ్యాయిని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోవడానికి ముందు ఆమె తీసుకున్న సెల్ఫీ వీడియో.. ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ప్యాపిలి మండలం నేరేడు చర్లకు చెందిన నాగమల్లీశ్వరీ బాయి, కల్లూరు మండలం బొల్లవరానికి చెందిన  ఎరుకలి సుధాకర్ తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. సుధాకర్ కి ఇది రెండో వివాహం. వృత్తిరిత్యా ఇద్దరూ ఉపాధ్యాయులే. కాగా.. సుధాకర్ రోజూ సాయంత్రం తాగి వచ్చి.. భార్యను నానా రకాలుగా హింసిస్తున్నాడు.

ఆ బాధలు తట్టుకోలేక ఆమె పురుగుల మందు తాగి ఆత్యహత్యకు పాల్పడింది. భర్త వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నట్లు ఆమె చెప్పింది. తన ముగ్గురు బిడ్డలను తన భర్తకు మాత్రం అప్పగించవద్దని ఆమె సెల్ఫీ వీడియో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.