వాహనదారులకు టోల్ బాదుడే..

First Published 31, Mar 2018, 4:58 PM IST
Toll tax on national highways up for 7 percent from this midnight
Highlights
నేషనల్ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) జాతీయ రహదారులపై టోల్‌ రేట్లను 5 నుంచి 7శాతం సవరించింది.

జాతీయ రహదారులపై వెళ్తున్నారా? అయితే ఇకపై మీకు మరింత బాదుడు తప్పదు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా నేషనల్ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) జాతీయ రహదారులపై టోల్‌ రేట్లను 5 నుంచి 7శాతం సవరించింది. దీని ప్రకారం టోల్‌ రేట్లు పెరగనున్నట్లు ట్రాన్స్‌పోర్టర్లు చెబుతున్నారు.

రేట్ల పెంపుపై నేషనల్‌ హైవే-2 ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ మహ్మద్‌ సఫీ ఓ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై 372 టోల్‌ప్లాజాలు ఉన్నట్లు చెప్పారు. ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో టోల్‌ రేట్లను సవరిస్తామన్నారు. టోకుధరల సూచీ ఆధారంగా ఈ రేట్లను సవరిస్తమని చెప్పారు. ఇవి ఒక్కో టోల్‌ ప్లాజాకు ఒక్కో రకంగా ఉంటాయట. నేషనల్‌ హైవే-2పై టోల్‌ ధరలను ఈ సారి 5శాతం పెంచామని తెలిపారు.

పెంచిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. చాలా ప్లాజాల్లో 5శాతం పెరగగా కొన్ని చోట్ల 7శాతం వరకు పెరిగాయి. నెలవారీ టోల్‌ పాస్‌లపై కూడా ధరలు పెరిగాయి.

loader