Asianet News TeluguAsianet News Telugu

Top Stories : ఓటమి భయంతోనే కామారెడ్డికి సీఎం... తెలంగాణ తలరాతను మార్చే ఎన్నికలివి... ఈ టాప్ స్టోరీస్ మీకోసమే

అన్ని ప్రముఖ వార్తాపత్రికల్లోని వార్తాకథనాల సమాహారం టాప్ స్టోరీస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారం, రాజకీయ,  సభలు, కీలక నాయకుల ప్రసంగాలు... ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు.... జాతీయ అంతర్జాతీయ వార్తలను ఈ టాప్ స్టోరీస్ ద్వారా మీ ముందు వుంచుతున్నాం... 

 

 

 

 

Today Top stories of 24 November 2023 AKP
Author
First Published Nov 24, 2023, 7:36 AM IST

కాంగ్రెస్, బిజెపి మోసాలను నమ్మారో... ఇక అంతే : కేసీఆర్  

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవసాయానికి మూడుగంటల కరెంట్ ఇస్తానంటున్నాడని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. 10 హెచ్పి మోటార్లు పెట్టుకోవాలంటున్నాడు... అలాగైతే రైతులందరూ మోటార్లు వేస్తే లోవోల్టేజ్ తో ట్రాన్స్ ఫార్మర్లు, సబ్ స్టేషన్లు టపాసుల్లా పేలిపోతాయంటూ ఆందోళన వ్యక్తం చేసారు. ఇలా కాంగ్రెస్, బిజెపి లు మోసపూరితమైన, ప్రజలకు మేలుచేయని, అమలుకు సాధ్యంకాని హామీలను ఇస్తున్నాయని ... వాటిని నమ్మి గోస పడొద్దని కేసీఆర్ సూచించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు, జహీరాబాద్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగాన్ని ప్రధాన వార్తగా ప్రచురించింది 'ఈనాడు' దినపత్రిక. 

K Chandrashekar Rao : ధరణి వుండాలంటే బీఆర్ఎస్ మళ్లీ రావాల్సిందే : కేసీఆర్


తెలంగాణ తలరాతను మార్చే ఎన్నికలివి 

 ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటిలాగే ఐదేళ్లకోసారి జరిగేవి కావని... తెలంగాణ తలరాతను మార్చే ఎన్నికలని బిజెపి జాతీయాధ్యక్షుడు జేపి నడ్డా పేర్కొన్నారు. తెలంగాణకు గత పదేళ్లుగా పట్టిన గ్రహణం ఈ ఎన్నికలతో వీడనుందని అన్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందని...  అప్పుడు కేసీఆర్ కుటుంబం అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తామని అన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజుక్ట్ లో జరిగిన అవినీతి, రాష్ట్రంలో సాగుతున్న భూకుంభకోణాలకు పాల్పడిన దోషులను తప్పకుండా శిక్షిస్తామన్నారు. ఇలా సంగారెడ్డి జిల్లాలో బిజెపి నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో నడ్డా ప్రసంగాన్ని ఈనాడు ప్రచురించింది. 

Jagat Prakash Nadda: బీజేపీని గెలిపిస్తే తెలంగాణ రూపు రేఖలు మారుస్తాం


గజ్వేల్ లో ఓటమి భయమే కామారెడ్డికి మార్చింది... 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లోనే ఓడిపోయే పరిస్థితి వుంది... ఆ భయంతోనే ఆయన కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయారు... అందువల్లే ఆయన మాటల్లో ఎక్కడ అధికారం పోతుందోననే ఆందోళన స్పష్టంగా కనిపిస్తుందన్నారు. తన తండ్రి కేసీఆర్ వందరూపాయల నోటులాంటివాడు... భద్రంగా దాచుకోవాలని కేటీఆర్ అంటున్నాడు.. కానీ కేసీఆర్ చెల్లనినోటని ప్రజలు అనుకుంటున్నారని రేవంత్ ఎద్దేవా చేసారు. కేసీఆర్ ఎప్పుడడూ ఒక్కచోట పోటీచేయడని... నియోజకవర్గాలు మారుస్తూ ప్రజలను మోసం చేస్తుంటాడని రేవంత్ అన్నారు. ఇలా హుజరాబాద్, మానుకొండూరు, సిద్దిపేట, దుబ్బాక, హైదరాబాద్ లోని ఎల్బీ నగర్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో రేవంత్ ఎన్నికల ప్రచారాన్ని ఈనాడు ప్రచురించింది. 


అక్కడ ఓటుకు 3వేలు... మందు , మాంసం బోనస్... 

తెలంగాణ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు మరో వారంరోజుల సమయం వుంది... కానీ ఇప్పటినుండే కొందరు అభ్యర్థులు డబ్బుల పంపిణీ ప్రారంభించారంటూ 'ఈనాడు' పేర్కొంది.  ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటుకు రూ.2 వేల నుడి రూ.3 వేలవరకు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఇలా కేవలం డబ్బులే కాదు మద్యం, మాంసం కూడా పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారట. ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ కీలక నియోజకర్గంలో పోటాపోటీగా డబ్బులు పంచుతున్నారని ఈనాడు పేర్కొంది. 

ఓట్ల కోసం కాదు... సంకల్పంతో అడుగులు 

వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల ద్వారా ఆడబిడ్డల పెళ్లళ్లు చేసిన తల్లుల ఖాతాలో నగదు జమ చేసారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీన్ని సాక్షి దినపత్రిక ప్రధాన వార్తగా తీసుకుంది. అమ్మాయిల పెళ్లికి ఆర్థిక సాయం చేసేందుకు పదోతరగతి ఉత్తీర్ణత, కనీస వయసు నిబంధన ఎందుకని తనను చాలా మంది అడుగుతున్నారు... కానీ దీనివెనక మహిళా రక్షణ దాగివుందన్నారు. బాల్య వివాహాలన అడ్డుకుని అమ్మాయిలు ఉన్నతచదువులు చదివేందుకు ఈ నిబంధన ఉపయోగపడుతుందని అన్నారు. లీడర్లుగా వున్నపుడు మన సంకల్పం మంచిదై వుంటే ఇలాంటి మంచి పథకాలు అమలవుతాయని అన్నారు.  ఈ ఏడాది జూలై, ఆగస్ట్,సెప్టెంబర్ నెలల్లో పెళ్లిచేసుకున్న 10,511 జంటలకు కల్యాణమస్తు, షాదీ ముబారక్ కింద రూ.81.64 నిధులు విడుదల చేసారు సీఎం జగన్. 

YS Jaganmohan Reddy : ఆడబిడ్డల పేరెంట్స్ కు జగన్ సర్కార్ గుడ్ న్యూస్... ఖాతాల్లో డబ్బులు జమ


విశాఖ నుండ పాలన దిశగా కీలక అడుగులు

వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా విశాఖపట్నం నుండి పాలన సాగించేందుకు మరో ముందడుగు పడింది.  విశాఖలోని మిలీనియం టవర్ లో మంత్రులు, సీనియర్ అధికారుల క్యాంప్ కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 16 శాఖలకు వివిధ ప్రాంతాల్లో భవనాల కేటాయించగా మరో 19 శాఖలకు భవనాలు కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇలా విశాఖ నుండి పాలన సాగించేందుకు జగన్ సర్కార్ చేపట్టిన చర్యలను ప్రధాన వార్తగా ప్రచురిచింది సాక్షి. 

విశాఖ పరిపాలనా రాజధాని : మంత్రులు, అధికారుల క్యాంప్ కార్యాలయాలు గుర్తింపు .. సీఎస్ ఆదేశాలు

రాజకీయాల కోసం కాళేశ్వరంను బద్నాం చేయొద్దు 

భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ నిర్మాణంలో చిన్నచిన్న లోపాలు సాధారణంగా జరుగుతుంటాయి... వాటిని చూపించి కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయవద్దని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతిపక్షాలను కోరారు. తెలంగాణ ఉద్యమ నినాదం నీళ్ళు, నిధులు, నియామకాలకు కేసీఆర్ పాలనలో సంపూర్ణ న్యాయం జరిగిందని అన్నారు. అలాగే భూముల వివరాలు, రిజస్ట్రేషన్ల పారదర్శకత కోసమే ధరణిని తీసుకువచ్చామని... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ పటేల్ పట్వారి వ్యవస్థ వస్తుందన్నారు. కాంగ్రెస్ సన్నాసులను నమ్మితే మునిగిపోతారని కేటీఆర్ హెచ్చరించారు. ఇలా తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రజంటేషన్ లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తగా ప్రచురించింది. 


కేసీఆర్ ను రెండుచోట్ల  ఓడిస్తాం... 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గజ్వేల్, కామారెడ్డి రెండుచోట్ల ఓడించేది బిజెపి అభ్యర్థులేనని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. స్పష్టమైన మెజారిటీతో తెలంగాణలో బిజెపి అధికారం చేపడుతుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వందకు పైగా సీట్లలో బిజెపి ప్రధానంగా పోటీలో వుందన్నారు. యువత, నిరుద్యోగుల్లో నిశ్శబ్ద విప్లవం వుందని... ఇది ఎన్నికల ఫలితాల రోజు బయటపడుతుందని అన్నారు.  ప్రజలు ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా కుక్కలు తినోటోడు పోయి నక్కలు తినటోడు వస్తాడు అన్నారు. ఇలా కిషన్ రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూను 'ఆంధ్రజ్యోతి' ప్రచురించింది. 

కాంగ్రెస్, బిజెపి ఎన్నికల సభలు వెలవెల 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ పార్టీల నిర్వహిస్తున్న సభలు జనాలు లేక వెలవెలబోతున్నాయంటూ... ఎక్కడికి పోయినా ఖాళీ కూర్చీలే దర్శనమిస్తున్నాయంటా నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.  ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బిజెపి జాతీయాధ్యక్షుడు జేపి నడ్డా సభలకు జనమే రాలేనంటూ ఖాళీ కుర్చీలతో కూడిన ఫోటోలను ప్రచురించింది. రేవంత్ రెడ్డి ప్రసంగానికి ముందే సభకు వచ్చిన కొద్దిమంది కూడా జారుకుంటున్నారని.. వారిని ఆపేందకు నాయకులు తంటాలు పడుతున్నారని పేర్కొంది. కాంగ్రెస్, బిజెపిల ఓటమికి ఈ సభలే సంకేతమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారని నమస్తే తెలంగాణ పేర్కొంది. 


బెంగళూరులో రియల్టీ ఉల్టా పల్టా 

కర్ణాటక రాజధాని బెంగళూరులో భూముల ధరలు భారీగా తగ్గిపోయి రియల్ ఎస్టేట్ కుదేలయి పోయిందంటూ ఓ ప్రత్యేక కథనాన్ని నమస్తే తెలంగాణ ప్రధాన వార్తగా ప్రచురించింది. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనే ఇందుకు కారణమని పేర్కొంది. రెసిడెన్షియల్, కమర్షియల్ భూముల ధరలు పతనం అయ్యాయని వెస్టియన్, సిబీఆర్ఈ,  కుష్మన్ ఆండ్ వెక్ ఫీల్డ్ , అనరాక్ వంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల నివేదికలే చెబుతున్నాయని అన్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బెంగళూరు రియల్టర్లు మండిపోతున్నారట. ఇదే సమయంలో పదేళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ లో రియల్ బూమ్ కొనసాగుతోందని...  రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణలో టాప్ లో వుందని నమస్తే తెలంగాణ పేర్కొంది. 

  

Follow Us:
Download App:
  • android
  • ios