పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో మరో కీలక అంకానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. కాసేపట్లో (ఉదయం 10.30కు)ఇరిగేషన్ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ నిపుణులు పోలవరం స్పిల్ ఛానెల్ లో తిరిగి కాంక్రీట్ పనులు మొదలు పెట్టనున్నారు.  

2020 జూలైలో వచ్చిన వరదలతో స్పిల్ ఛానెల్ మట్టి పనులు మరియు కాంక్రీట్ పనులు నిలిచిపోయాయి. వరదలకు దాదాపు 3 టీఎంసీలకు పైగా వరద నీరు నిలిచింది. దీంతో కాంక్రీట్ పనులు నిలిచిపోయాయి. దీంతో 2020 నవంబర్ 20 నుండి ప్రారంభమైన వరద నీటి తొడకం పనులు ప్రారంభించారు. వరద నీటిని తోడేందుకు దాదాపు 70 భారీ పంపులను ఏర్పాటుచేశారు. ఇలా దాదాపు రెండు నెలలపాటు సాగిన నీటి తోడకం ఇటీవలే పూర్తయ్యింది. దీంతో మళ్లీ కాంక్రిట్ పనులు చేపట్టాలని నిర్మాణ సంస్థ నిర్ణయించింది.

read more  పోలవరంపై చంద్రబాబు దారిలోనే జగన్: ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

నీరు తొలగించిన చోట మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులను మొదలు పెట్టనున్నట్లు మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే 2.5టీఎంసీల వరద నీటిని గోదావరి నదిలోకి తొడిపోసినట్లు మేఘా ఇంజనీరింగ్ నిపుణులు వెల్లడించారు. దీంతో స్పిల్ ఛానెల్ లో మట్టి తవ్వకం పనులతో పాటు అంతర్గత రహదారుల నిర్మాణ పనులు మొదలైనట్లు తెలిపారు.

 ఇప్పటి వరకు 1,10,033 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పని,  స్పిల్ ఛానెల్ లో 10,64,417 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనుల పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన మట్టితవ్వకం, కాంక్రీట్ నిర్మాణ పనులు ఈఏడాది జూన్ లోగా పూర్తిచేమడమే లక్ష్యంగా పనులు చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ సంస్థ వెల్లడించింది.