విజయవాడలో రోడ్డు ప్రమాదం : తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు గాయాలు

First Published 28, May 2018, 5:09 PM IST
Tirupati MLA Sugunamma Injured In Road Accident
Highlights

తృటిలో తప్పిన పెను ప్రమాదం

తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు తృటిలో ప్రమాదం తప్పింది. మహానాడు సందర్భంగా విజయవాడకు వెళ్లిన ఆమె అక్కడ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీ కొట్టింది. అయితే ప్రమాద సమయంలో ఇరు వాహనాలు తక్కువ స్పీడ్ లో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల వేదికగా జరుగుతున్న మహానాడులో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే ఈమె తన కారులో వెళ్తుండగా స్థానిక బెంజి సర్కిల్ దగ్గర ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన భద్రతాసిబ్బంది ఆమెను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. గాయపడ్డ సుగుణమ్మను పలువురు నేతలు పరామర్శించారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. 
 

loader