Asianet News TeluguAsianet News Telugu

ఆగస్ట్ 24న అక్టోబర్ మాసం ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. టీటీడీ ప్రకటన, వివరాలివే

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఆగస్ట్ 24న విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన ఈ ఆర్జిత సేవల టికెట్లను ఎల్లుండి ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని వెల్లడించింది. 

tirumala sevas tickets for october month oreleased on august 24
Author
Tirumala, First Published Aug 22, 2022, 8:05 PM IST

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఆగస్ట్ 24న విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన ఈ ఆర్జిత సేవల టికెట్లను ఎల్లుండి ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని వెల్లడించింది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు మరికొన్ని ఆర్జిత సేవల టికెట్లను లక్కీ డీప్ ద్వారా కేటాయిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. 

ఇకపోతే.. తిరుమలలో గదుల కేటాయింపులో తరచూ అక్రమాలు జరుగుతుండటం, పలువురు పట్టుబడుతూ వుండటంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి సీరియస్‌గా దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా గదుల కేటాయింపు ప్రక్రియపై ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో భేటీ అయ్యారు. ఇప్పటికే గదుల కేటాయింపులో వున్న లోపాలను టీటీడీ గుర్తించింది. గదుల కేటాయింపులో దళారులను ఏరివేసేలా.. పోలీస్, విజిలెన్స్ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ధర్మారెడ్డి నిర్ణయించారు. 

మరోవైపు.. టీటీడీలో ఇంటి దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీవారి దర్శన టికెట్లు విక్రయిస్తున్న టీటీడీ సూపరింటెండెంట్‌ మల్లిఖార్జున్‌తో పాటు ఇద్దరు మహిళల్ని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. కొన్నేళ్లుగా భారీగా వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు విక్రయించినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 760 బ్రేక్ దర్శన టికెట్లు, 350 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, 25 సుప్రభాత సేవా టికెట్లను, 32 గదులను విక్రయించినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios