తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది. 

ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలోనే  వార్షిక ఉత్సవాలను టీటీడీ నిర్వహించింది.  ఈ నెల 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది.

నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని తిరువీధుల్లో భక్తుల మధ్య నిర్వహించాలని టీటీడీ భావించింది. అయితే కరోనా నేపథ్యంలో ఈ ఉత్సవాలను  ఏకాంతంగానే నిర్వహించాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది.

ఈ మేరకు టీటీడీ ఈవో జవహార్ రెడ్డి ప్రకటించారు.  అధికమాసం కావడంతో ఈ ఏడాది రెండు దఫాలు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు.మతపరమైన కార్యక్రమాలు, ఉత్సవాలకు 200 మందికి మించి ఉండొద్దని కేంద్రం సూచించడంతో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించారు.

కరోనా జాగ్రత్తలు తీసుకొంటూ తిరుమలలో భక్తులకు దర్శనాలను కల్పిస్తుున్నారు. కరోనా సమయంలో తిరుమల శ్రీవారికి ఏకాంతసేవలు నిర్వహించారు. అయితే భక్తుల దర్శనాలను పరిమితం చేశారు. గతంలో మాదిరిగా వేలాది మంది భక్తులు దైవ దర్శనం కోసం టీటీడీ అవకాశం కల్పించలేదు. కరోనా జాగ్రత్తలు తీసుకొంటూనే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. 

ఇదే క్రమంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.