దినకరన్ ఘన విజయం

దినకరన్ ఘన విజయం

చెన్నైలోని ఆర్కెనగర్ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్ధి టిటివి దినకరన్ ఘనవిజయం సాధించారు. ఎంతో ఉత్కంఠకు గురిచేసిన ఎన్నికలో సమీప అధికారపార్టీ ఏఐఏడిఎంకె అభ్యర్ధి మధుసూదనన్ పై 40, 707 ఓట్ల మెజారిటీ సాధించారు. మొత్తం 18 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి దినకరన్ కు 89, 013 ఓట్లు రాగా, మధుసూదనన్ కు  48, 306 ఓట్లొచ్చాయి. విచిత్రమేమిటంటే గట్టిపోటి ఇస్తుందనుకున్న ప్రధాన ప్రతిపక్ష డిఎంకె అభ్యర్ధికి అసలు డిపాజిట్టే దక్కలేదు. అయితే, డిఎంకె అభ్యర్ధికి 24, 651 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో పాటు మరో 50 మంది అభ్యర్ధులకు కూడా డిపాజిట్లు గల్లంతయ్యాయి.

ఇక్కడ ఇంకో విశేషమేమిటంటే నోటాకు 2,373 ఓట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి 1,417 ఓట్లు మాత్రమే దక్కాయి. ఈ ఎన్నిక ద్వారా తమిళనాడు రాజకీయాల్లో భాజపా చక్రం తిప్పాలని అనుకున్నది. అయితే, భాజపా ను జనాలు పూర్తిగా పక్కన పెట్టేసారన్నది స్పష్టంగా తేలిపోయింది. కౌంటింగ్ మొదలైన దగ్గర నుండి దినకరన్ ఆధిక్యత స్పష్టంగా కనబడింది. ఏ దశలో కూడా టిటివికి ఏ పార్టీ కూడా పోటీ ఇవ్వలేకపోయాయి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page