విశాఖపట్నంలో ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఈ నెల 24వ తేదీన కే కోటపాడుకు వెళ్లిన ముగ్గురు ఇంటర్ విద్యార్థులు.. తిరిగి వారి ఇళ్లకు చేరుకోలేదు.
విశాఖపట్నంలో ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఈ నెల 24వ తేదీన కే కోటపాడుకు వెళ్లిన ముగ్గురు ఇంటర్ విద్యార్థులు.. తిరిగి వారి ఇళ్లకు చేరుకోలేదు. కే కోటపాడు నుంచి తిరుగు పయనం అయినప్పటికీ ఇంటికి చేరుకోకపోవడంతో విద్యర్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన గాజువాక పోలీసులు.. విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు వారి ఆచూకీ లభించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.
అయితే కనిపించకుండా పోయిన ముగ్గురు విద్యార్థులు కూడా స్నేహితులు. ముగ్గురు కూడా మైనర్లే. వీరిలో ఇద్దరు చిన్నప్పటి నుంచే స్నేహితులు కాగా.. మరో వ్యక్తి కొంతకాలం క్రితం వీరికి స్నేహితుడిగా మారారు. ఈ క్రమంలోనే స్నేహితులైన ముగ్గురు విద్యార్థులు.. ఉద్దేశపూర్వకంగానే ఎక్కడికైనా వెళ్లారా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అలాగే ఏదైనా ప్రమాదానికి గురయ్యారా? అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు.
