విశాఖపట్నంలోని రామజోగిపేటలో బుధవారం రాత్రి ఓ బిల్డింగ్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో వ్యక్తి కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపడుతోంది. 


విశాఖపట్నంలోని కలెక్టర్ కార్యాలయం దగ్గరలో ఉన్న రామజోగిపేటలో మూడు అంతస్తుల బిల్డింగ్ కూలిపోయింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. వారిని 14 ఏళ్ల సాకేటి అంజలి, 17 ఏళ్ల దుర్గాప్రసాద్‌గా గుర్తించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నిన్న మాధవ్, ఈరోజు వీర్రాజు.. ఆ మాటల్లో ఆంతర్యం ఏంటీ, జనసేనతో బీజేపీ కటీఫేనా..?

బిల్డింగ్ కుప్పకూలిన ఘటనలో మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వీరితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ టీమ్స్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వెంటనే సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాయి. 

Scroll to load tweet…

ఉన్నట్టుండి ఒక్క సారిగా బిల్డింగ్ కుప్పకూలడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో బిల్డింగ్ లో 8 మంది ఉన్నారు. అయితే ఇద్దరు మరణించగా.. మరో ఐదుగురు ప్రాణాలతో భయటపడ్డారు. మరో వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అతడి కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపడుతోంది. ఈ ఘటనలో ఐదుగురి క్షతగాత్రులను చికిత్స కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. బిల్డింగ్ కుప్పకూలిన ప్రదేశాన్ని పోలీసులు ఉన్నతాధికారులు పరిశీలించారు.