Asianet News TeluguAsianet News Telugu

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ముగ్గురికి 20యేళ్ల జైలు శిక్ష..

మైనర్ బాలిక మీద అత్యాచారం ఘటనలో ముగ్గురు నిందితులకు విశాఖపట్నం కోర్టు 20యేళ్ల జైలు శిక్ష విధించింది. 2011లో ఈ ఘటన జరిగింది. 
 

Three sentenced to 20 years in prison for rape of minor girl In Visakhapatnam
Author
First Published Dec 30, 2022, 6:44 AM IST

విశాఖపట్నం : విశాఖపట్నం ఆరో అదనపు జిల్లా న్యాయస్థానం/మహిళా న్యాయస్థానం న్యాయమూర్తి ఏం సువర్ణరాజు గురువారం ఓ అత్యాచారం కేసులో 20యేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు నిచ్చారు. మైనర్ బాలికను మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డ సంఘటనలో ముగ్గురు నిందితులకు 20 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధించారు. దీంతో పాటు ముగ్గురూ మరో పదివేల చొప్పున జరిమానా కట్టాలని ఆదేశించారు. ఒకవేళ నిందితులు ఎవరైనా ఈ పదివేల జరిమానా కట్టలేకపోతే.. 20యేళ్ల జైలుశిక్షతో పాటు మరో నెల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు. 

ఈ కేసుకు సంబంధించి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఎం. శైలజ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. విశాఖపట్నం గాజువాక సమీపంలోని భానోజీతోట ప్రాంతానికి చెందిన మహ్మద్ అష్రాఫ్, మహ్మద్ అమీర్ అలమ్, పోటేలు రాంజీ అనే ముగ్గురు వ్యక్తులు స్నేహితులు. 2011 నవంబరు 28న ఓ 11 ఏళ్ల బాలిక మీద సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. చిన్నారి అదే ప్రాంతానికి చెందిన అమ్మాయి. అక్కడి దగ్గర్లోని గవర్నమెంట్ స్కూల్లో 5వ తరగతి చదువుకుంటోంది. ఆ రోజు తన సోదరికి జ్వరంగా ఉండడంతో ఆమెకోసం బ్రెడ్ తీసుకురావడానికి చిన్నారిఒంటరిగా  బయటకొచ్చింది. 

ఎమ్మెల్యే నేనా, ఆయనా... పార్టీ పరిశీలకుడి ముందే ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు

అది గమనించిన ముగ్గురు నిందితులు... ఆ చిన్నారికి బిస్కెట్లు, డబ్బులు ఇస్తామని ఆశ చూపించారు. అక్కడినుంచి చిన్నారిని కాస్త దూరంగా తీసుకువెళ్లి.. ముగ్గురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత ఇంటికి వచ్చిన చిన్నారి ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి.. వారి నేరం రుజువు కావడంతో నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష, పదివేల జరిమానా విధించారు.

ఇదిలా ఉండగా,  2016లో తన కూతురిపై అత్యాచారం చేసి.. ఆమె గర్భం దాల్చడానికి కారణం అయిన కేసులో కేరళకు చెందిన ఓ వ్యక్తికి డిసెంబర్ 23న 31 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే, ఈ కేసులో తరువాతి సమయంలో విచారణ కాలంలో.. బాధితురాలు, ఆమె తల్లితో సహా చాల మంది ముఖ్యమైన సాక్షులు.. నిందితుడికి అనుకూలంగా వాంగ్మూలాలు ఇచ్చారు. అతను తమను పోషించే ఏకైక ఆధారమని అతను జైలుకు వెడితే తమ పరిస్థితి ఏంటని వీరు వాదించారు. అయితే కోర్టు మాత్రం.. దీనిని ఒప్పుకోలేదు. 

దీంతో కేసు నీరుగారిపోకుండా.. గర్భస్రావం చేయబడిన పిండం నుండి తీసిన డీఎన్ఏ శాంపిల్ ఆధారాల ఆధారంగా ఫాస్ట్ ట్రాక్ జడ్జి టీజీ వర్గీస్ సదరు వ్యక్తిని దోషిగా నిర్ధారించి శిక్ష విధించారు.గర్భస్రావం చేయబడిన పిండం నుండి సేకరించిన నమూనా నిందితుడి రక్త నమూనాతో సరిపోలడంతో అతను పిండానికి తండ్రి అని సూచించినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షిజో మోన్ జోసెఫ్ తెలిపారు. తండ్రి తన సొంత కూతురిపై అత్యాచారం చేసి, గర్భం దాల్చేలా చేయడం అత్యంత హేయమైన చర్య అని, నిందితుడు ఎలాంటి దయకు అర్హుడు కాదని కోర్టు పేర్కొంది.

బాలల లైంగిక నేరాల నుంచి రక్షణ (పోక్సో) చట్టం కింద వివిధ నేరాలకు సంబంధించి నిందితుడికి 31 ఏళ్ల జైలు శిక్ష విధించబడినప్పటికీ, అతను కేవలం 10 సంవత్సరాలు మాత్రమే శిక్ష అనుభవిస్తున్నాడు, ఇది అతనికి విధించిన వివిధ రకాల శిక్షల్లో అత్యధికం, ప్రాసిక్యూటర్ అన్నారు.

కోర్టు ఆ వ్యక్తికి రూ. 75,000 జరిమానా విధించింది. ఆమె పునరావాసం కోసం బాలికకు రూ. 50,000 చెల్లించాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశించింది. 2016లో ఇడుక్కి జిల్లా కొన్నతడి గ్రామంలోని తమ ఇంట్లో తన కుమార్తెపై (అప్పటికి 14 ఏళ్లు) రాత్రి సమయంలో వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఎస్పీపీ తెలిపారు. బాధితురాలు, ఆమె సోదరుడు, ఆమె తల్లిదండ్రులు కలిసి జీవించేదని ఎస్పీపీ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios