బాపట్ల జిల్లాలో పడవ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు గల్లంతయ్యారు. సముద్రంలో కెరటాల ఉద్ధృతికి పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సాయివర్ణిక అనే మహిళతో పాటు తనీష్, తరుణేశ్వర్ అనే చిన్నారులు గల్లంతయ్యారు.
బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు గల్లంతయ్యారు. నిజాంపట్నం హార్బర్ ఎంట్రన్స్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నాగాయలంక మండలం ఈలచెట్లదిబ్బ నుంచి ముత్తాయపాలెం వెళ్తుండగా సముద్రంలో కెరటాల ఉద్ధృతికి పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సాయివర్ణిక అనే మహిళతో పాటు తనీష్, తరుణేశ్వర్ అనే చిన్నారులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
