Asianet News TeluguAsianet News Telugu

కరోనా కాటు : పదిరోజుల్లో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి..

కరోనా మహమ్మారి పచ్చని కుటుంబాలను కకావికలం చేస్తుంది. కొన్ని కుటుంబాల పై కక్ష పడుతోంది. తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం, లాలాచెరువు హెచ్ బి కాలనీ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పది రోజుల వ్యవధిలో కరోనా వైరస్ తో మృతి చెందడం కాలనీవాసులను తీవ్రంగా కలచివేసింది. 

three members of same family deceased due to corona in east godavari - bsb
Author
Hyderabad, First Published May 10, 2021, 12:44 PM IST

కరోనా మహమ్మారి పచ్చని కుటుంబాలను కకావికలం చేస్తుంది. కొన్ని కుటుంబాల పై కక్ష పడుతోంది. తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం, లాలాచెరువు హెచ్ బి కాలనీ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పది రోజుల వ్యవధిలో కరోనా వైరస్ తో మృతి చెందడం కాలనీవాసులను తీవ్రంగా కలచివేసింది. 

రాజమహేంద్రవరంలో నటరాజు శివజ్యోతి థియేటర్లకు మేనేజర్గా పనిచేస్తున్న జి వివిఎస్ శర్మ అనే నటరాజ శర్మ(75) కరోనా వైరస్ తో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు

ఆయనకి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ముగ్గురు పిల్లలకు వివాహాలు చేశారు. ఈ సంతానంలో పది రోజుల క్రితం పెద్దమ్మాయి (45), ఐదు రోజుల క్రితం చిన్నమ్మాయి (32) కరోనా వైరస్ తో చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం శర్మ భార్య హోమ్‌క్వారంటైన్‌లో ఉన్నారు. 

వేదమాత బ్రాహ్మణ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా కూడా ఉన్న ఆయన అయ్యప్ప స్వామి మాల దీక్ష ధరించి 36 సంవత్సరాల నుంచి శబరిమల వెళ్ళి, వస్తూ గురుస్వామి గా పేరు పొందారు. నటరాజ్ థియేటర్ మేనేజర్ గా ఉండటంతో అంతా నటరాజ శర్మ అని పిలుస్తారు. శర్మ మరణం పట్ల మాజీ సర్పంచ్, వైఎస్ఆర్సీపీ నాయకుడు మెట్ల ఏసుపాదం విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేశారు.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

Follow Us:
Download App:
  • android
  • ios