అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రాప్తాడు మండలంలో గల 44వ జాతీయ రహదారి గొల్లపల్లి వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా...మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన వారు బుక్కరాయసముద్రం మండలం సిద్ధ రాంపురం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. వీరు బెంగళూరు నుంచి అనంతపురం వస్తుండగా గొల్లపల్లె సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.