విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెంలో నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. క్వారీ కోసం తవ్విన గుంతల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో స్నానాల కోసం దిగిన ముగ్గురు పిల్లలు మృతి చెందారు.

మృతులను బాలాజీ, శరత్, గిరీశ్‌గా గుర్తించారు. వీరు ముగ్గురు ఈత రాక మరణించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.