చంద్రన్న నీతి ఇలాగే ఉంటుంది

This is the style of functioning of naidu
Highlights

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐవైఆర్ పోస్టింగులు పెట్టటమే ఆయన చేసిన తప్పని అనుకుందాం. మరి, నేరుగా చంద్రబాబుపైనే ఆరోపణలు, విమర్శలు చేసిన జెసి దివాకర్ రెడ్డి, కేశినేని నాని మాటామేటి? మంత్రివర్త విస్తరణ తర్వాత చంద్రబాబుపై అనేకమంది పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. వారెవరిపైనా ఇప్పటి వరకూ చర్యలు ఎందుకు తీసుకోలేదు

కుక్కను చంపాలంటే ముందు అది పిచ్చిది అని ముద్రవేయాలంటారు. చంద్రబాబునాయుడు విధానం అదే విధంగా ఉంటుంది. బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును తీసేయటంలో చంద్రబాబునాయుడు చూపించిన వేగమే అందుకు నిదర్శనం. ఫెస్ బుక్ లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టింగులు పెట్టారని, ప్రభుత్వ వ్యతిరేక పోస్టింగులను షేర్ చేసారన్నది ఆయనపై వినిపిస్తున్న అభియోగాలు. సరే వాటన్నింటినీ మీడియా సమావేశం పెట్టి మరీ ఐవైఆర్ ఖండిస్తూనే చంద్రబాబు విధానాలను కూడా కడిగేసారనుకోండి అది వేరే సంగతి.

ఆరు మాసాలుగా ప్రయత్నిస్తున్న తనకు సిఎం అపాయింట్మెంట్ దొరకలేదన్నారు. ఒక కార్పొరేషన్ ఛైర్మన్ కు చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వకపోవటమేంటి? అదే సమయంలో కృష్ణారావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు నేతలు చెప్పిన మాటలను సిఎం నమ్మటమేంటో అర్ధంకావటం లేదు. ఫిర్యాదులు చేసిన చాలామంది నేతలకన్నా చంద్రబాబుకు కృష్ణారావే దశాబ్దాల ముందు నుండి తెలుసు.

అటువంటిది ఐవైఆర్ పై వచ్చిన అభియోగాలపై చంద్రబాబు వివరణ అడిగి ఉంటే బాగుండేది. చంద్రబాబు తనంతట తాను వివరణ కోరకపోగా ఐవైఆర్ కలవాలని ప్రయత్నించినా స్పందించలేదంటే అర్ధం ఏంటి? కృష్ణారావును ఛైర్మన్ గా తప్పించాలని ఇదివరకే చంద్రబాబు నిర్ణయించారన్నది అర్ధమవుతోంది.  

అందుకనే ఐవైఆర్ పై వ్యూహాత్మకంగా ఆరోపణలను తెరపైకి తెచ్చి రచ్చ చేయించటం, ఛైర్మన్ గా తీసేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయటం అన్నీ చకచక జరిగిపోయాయి. ఐవైఆర్ ను వివరణ అడక్కుండానే చంద్రబాబు నిర్ణయం తీసేసుకోవటం దేనికి నిదర్శనం.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐవైఆర్ పోస్టింగులు పెట్టటమే ఆయన చేసిన తప్పని అనుకుందాం. మరి, నేరుగా చంద్రబాబుపైనే ఆరోపణలు, విమర్శలు చేసిన జెసి దివాకర్ రెడ్డి, కేశినేని నాని మాటామేటి? మంత్రివర్త విస్తరణ తర్వాత చంద్రబాబుపై అనేకమంది పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. వారెవరిపైనా ఇప్పటి వరకూ చర్యలు ఎందుకు తీసుకోలేదు. అంటే వారిపై చర్యలు తీసుకుంటే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని భయం. అదే ఐవైఆర్ పై చర్యలు తీసుకుంటే అడిగేవారే లేరన్న ధీమా. ఇదే చంద్రన్న నీతి.

loader