ఈరోజు ఉదయం అసెంబ్లీని చూసేందుకు వైసీపీ ఎంఎల్ఏలు వెలగపూడికి చేరుకున్నారు. అయితే, ఎంఎల్ఏలను లోపలకు అనుమతించేది లేదంటూ భద్రతాసిబ్బంది స్పష్టంగా చెప్పారు. దాంతో ఎంఎల్ఏలు సిబ్బందిపై మండిపడ్డారు. దాంతో చేసేదిలేక కొందరిని మాత్రమే అనుమతిస్తామంటూ సిబ్బంది చెప్పటం గమనార్హం.
ఇది, చంద్రబాబునాయుడు రోజూ చెబుతున్న పారదర్శకత. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల్లోకి లీకవుతున్న వర్షపు నీటిని చూడటానికి వచ్చిన వైసీపీ ఎంఎల్ఏలను కూడా భద్రతాసిబ్బంది అడ్డుకున్నారు. మంగళవారం సాయంత్రం నుండి మీడియాను అసలు మెయిన్ గేట్ లోపలికే రానీయటం లేదు.
ఈరోజు ఉదయం అసెంబ్లీని చూసేందుకు వైసీపీ ఎంఎల్ఏలు వెలగపూడికి చేరుకున్నారు. అయితే, ఎంఎల్ఏలను లోపలకు అనుమతించేది లేదంటూ భద్రతాసిబ్బంది స్పష్టంగా చెప్పారు. దాంతో ఎంఎల్ఏలు సిబ్బందిపై మండిపడ్డారు. దాంతో చేసేదిలేక కొందరిని మాత్రమే అనుమతిస్తామంటూ సిబ్బంది చెప్పటం గమ
నార్హం. అంటే, అసెంబ్లీ లోపలకు చివరకు ఎంఎల్ఏలకు కూడా అనుమతి లేదంటే చంద్రబాబు మార్కు పారదర్శకత ఏమిటో అర్ధమవుతోంది.
టిడిపి ఎప్పుడు అధికారంలో ఉన్న ఇదే పరిస్ధితి. చెప్పేదొకటి, చేసేదొకటి. మంగళవారం సాయంత్రం 30 నిముషాల పాటు కురిసి ఓ మాదిరి వర్షానికే సచివాలయంలోని బ్లాకులు, అసెంబ్లీలోని పలు ఛాంబర్లలో వర్షపు నీరు ధారగా కారుతోంది. వర్షపు నీటి లీకేజీ వల్ల ఫర్నీచర్ దాదాపు దెబ్బతింది. వందలాది ఫైళ్ళు నీటిలో తడిసిపోయన సంగతి తెలిసిందే.
