రాష్ట్రంలో ఉత్తుత్తి పాలన నడుస్తోందట. ప్రజల సొమ్మును హంగు, ఆర్భాటాల కోసం ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తుంటే రాష్ట్రంలో ఆర్ధికలోటు కాక మరేముంటుందంటూ జయప్రకాశ్ నారాయణ (జెపి) మండిపడ్డారు. రాష్ట్రంలో ఉత్తుత్తి పాలన, ఉత్తుత్తి చదవులు సాగిస్తూ ఓట్లేసిన జనాలను ప్రభుత్వం మోసం చేస్తున్నట్లు ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ఉత్తుత్తి పాలన నడుస్తోందట. ప్రజల సొమ్మును హంగు, ఆర్భాటాల కోసం ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తుంటే రాష్ట్రంలో ఆర్ధికలోటు కాక మరేముంటుందంటూ జయప్రకాశ్ నారాయణ (జెపి) మండిపడ్డారు. ‘‘జనం కోసం జెపి...సురాజ్య యాత్ర’’ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉత్తుత్తి పాలన, ఉత్తుత్తి చదవులు సాగిస్తూ ఓట్లేసిన జనాలను ప్రభుత్వం మోసం చేస్తున్నట్లు ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి సిగ్గులేదన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే తాయిలాలలకు ఆశపడకుండా మంచి పాలన కోసం ఏం చేయాలనే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సురాజ్య యాత్ర మొదలుపెట్టినట్లు జెపి వివరించారు.
పనిలో పనిగా కేంద్రంపైన కుడా విమర్శలు చేసారు. దేశంలో కోట్ల రూపాయలు ఖర్చుచేసి బుల్లెట్ రైలు వేసే కంటే అంతకంటే తక్కువ ఖర్చుతో భారతీయ రైల్వే వ్యవస్ధనే బాగు చేయవచ్చని సలహా ఇచ్చారు. 508 కిలోమీటర్ల బుల్లెట్ రైలు కోసం 1.10 లక్షల కోట్లు తగలేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇంతచేసి బుల్లెట్ రైలు ఉపయోగం కేవలం 30 వేలమందికి మాత్రమేనన్నారు. అంతే మొత్తాన్ని ఖర్చు చేస్తే 10 వేల కిలోమీటర్ల రైల్వేలైన్లను పటిష్టం చేయవచ్చన్నారు. కేంద్ర, రాష్ట్రాలు చేస్తున్న ప్రజాధనం దుర్వినియోగం వల్ల అనారోగ్యం కారణాలతో 6.4 కోట్లమంది పేదలు మరింత పేదలుగా మారిపోతున్నట్లు బాధపడ్డారు. మానవాభివృద్ధి సూచిలో మనదేశం 103వ స్ధానంలో ఉండటమే అందుకు నిదర్శనంగా జెపి వివరించారు.
