Asianet News TeluguAsianet News Telugu

వైసీపీలో మూడో లిస్ట్ టెన్షన్.. తాడేపల్లికి నేతల క్యూ.. రాజీనామాల బాటలో టికెట్ రాని నేతలు !

వైసీపీలో మూడో జాబితాపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొంతమంది సిట్టింగులు పార్టీకి రాజీనామా చేశారు. 

Third list tension in YCP in andhrapradesh - bsb
Author
First Published Jan 6, 2024, 9:33 AM IST

అమరావతి : వైసీపీలో మార్పులు, చేర్పులు కలకలం రేపుతున్నాయి. మొదటి విడతలో 11 మందిని, రెండో విడతలో 27మందిని.. మొత్తంగా 38మందిని మార్చింది. త్వరలోనే మూడో జాబితా కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. మూడో విడత ఇంచార్జ్ ల తుది జాబితాలో పది నుంచి 15 మందిని మార్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. 

ఇప్పటికే టికెట్ లేకపోవడంతో పోటీలో ఉండబోనని తేల్చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లారు. మంత్రి గుమ్మనూరు జయరాం..నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మషేష్ రెడ్డి క్యాంప్ ఆఫీసు దగ్గర కనిపించారు. ఇలా వరుసగా తాడేపల్లికి క్యూ కడుతున్నవారు పెరుగుతున్నారు.  

టికెట్లు రానివారు పార్టీని వీడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీలో చర్చనీయాంశంగా మారారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని కలుస్తామంటే బిజీ అన్నారని.. ఉదయం నుంచి పడిగాపులు కాశామని కానీ టైం ఇవ్వలేదని.. ఇంతకంటే పెద్ద అవమానం లేదని, నమ్మినందుకు గొంతు కోయడం ఒకటే మిగిలిందని.. మా జీవితాలు సర్వనాశనం అయిపోయాయి.. 

ఇప్పటికైనా సొంత నిర్ణయాలు తీసుకుని, స్వతంత్రంగా బతకాలనుకుంటున్నామని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాను కల్యాణ దుర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని.. తన భార్య, కొడుకు కూడా వేర్వేరు చోట్ల నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. అంతేకాదు ఎక్కడినుంచైనా అవకాశం వస్తే అందిపుచ్చుకుని ముందుకు వెడతామని తెలిపారు. 

కేశినేని నాని రూట్ ఎటూ ? టార్గెట్ చంద్రబాబేనా??

గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా అసంతృప్తిలో ఉన్నారు. గిద్దలూరులో ఇన్ ఛార్జిని మార్చడంతో అసహనం వ్యక్తం చేశారు దీంతో ముఖ్యమంత్రి జగన్ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సారి టికెట్ లేదని చెప్పడంతో.. పోటీకి దిగనని, సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. మరోవైపు వెల్లంపల్లి శ్రీనివాస్ ను విజయవాడ సెంట్రల్ కు మార్చారు. నియోజకవర్గం మారడం అంటే బాధగానే ఉంటుందని కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. విజయవాడలో వెల్లంపల్లి వర్గం, మల్లాది వర్గం అన ఉండవని జగన్ వర్గం ఒక్కటే ఉంటుందన్నారు.

జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, బి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబుకు కూడా టికెట్లు లేవని చెప్పారు. దీంతో వారు పార్టీ కార్యక్రమాలకు దూరం అయ్యారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ కూడా ఇతర పార్టీల నుంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారట. 

దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ కు కూడా అధిష్టానం టిక్కట్ లేదని తేల్చి చెప్పేసింది. ప్రతిగా మూడు ఆఫర్స్ ఇచ్చిందట. కానీ ఆయన రాజీనామా బాటలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించాలని ప్రభుత్వ సలహాదారులకు తాకిడి పెరుగుతోందట. 

దీంతో వైసీపీలో టికెట్ల వివాదం కొంత తీవ్రంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. పలు జిల్లాల్లో టికెట్లు రాని నేతలు పార్టీని వీడుతున్నారు. ఉత్తరాంధ్రలో
వంశీకృష్ణ, సుధాకర్, దాడి వీరభద్రరావు, సి రామచంద్రయ్య'కాపు రామచంద్రారెడ్డిలు పార్టీని వీడారు. కృష్ణా జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందట. 

 ప్రకాశం జిల్లా వైసీపీలో మాగుంట, మహీధర్ రెడ్డికి ప్రతిపక్షాలపై దూకుడుగా వ్యవహరించాలని జగన్ షరతులు విధించారట. మరో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ముఖ్యమంత్రి జగన్ పై ఫైర్ అయ్యారు. తనకు టికెట్ లేదని, తాను గెలవనని ఎలా నిర్ణయిస్తారంటూ ప్రశ్నించారు. ఆ తరువాత తాను జగన్ వెంటే ఉంటానని, జగన్ వల్లే తానీస్థాయికి వచ్చానని.. కుటుంబంలో తండ్రిమీద కొడుకు ఎలా మాట్లాడతాడో తానలా మాట్లాడనని మాట మార్చారు. 

రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీని వీడి అవకాశం ఉందని తెలుస్తోంది. వేమిరెడ్డిని నెల్లూరు నుంచి పోటీకి ఆదేశించారు. అయితే నెల్లూరు నుంచి పోటీ చేసేందుకు వేమిరెడ్డి విముఖంగా ఉన్నారు. దీంతో టీడీపీ నేతలు వేమిరెడ్డితో టచ్‍లోకి వెళ్లినట్లు సమాచారం. వైసీపీలో మార్పులపై ఫైర్ అయ్యేవారిమీద పెద్దిరెడ్డి, పేర్నినాని సీరియస్ అయ్యారు. 

గెలిచే వారికే టికెట్లు ఇస్తారని.. అలా కాదన్నందుకు పనిచేసి చూపించాలని అంతేకాని ఇలా తీవ్ర విమర్శలు సరికాదంటున్నారు. మరోవైపు పేర్నినాని కాపు రాంచంద్రారెడ్డిపై విరుచుకుపడ్డారు. డబ్బు ఉంటే సరిపోదని.. పార్టీ ఎందుకు నో చెప్పిందో తెలుసుకుని మాట్లాడాలని.. జగన్ మీద ఇలాంటి మాటలు మంచివి కాదన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios