టీడీపీ ఎక్కడ అభివృద్ది చేసిందో చూపించాలని సవాల్ విసిరారు ఐజయ్య. అభివృద్ది లేదు కేవలం అవినీతి మాత్రమే ఉందన్నారు. రోడ్ల విస్తీర్ణం కోసం ఇళ్లను కూల్చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు పరిహారం అందించలేదు.
నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభివృద్ది నినాదంతో కాకుండా అవినీతితో గెలిచిందని వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య విరుచుకుపడ్డారు. అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. నంద్యాల విజయం కోసం వందల కోట్ల రూపాయలు పంచిందన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీపై నిప్పులు చెరిగారు.
అభివృద్ది కి ఓటు వేశారంటున్న టీడీపీ నేతలు.. ఎక్కడ అభివృద్ది జరిగిందో చూపించాలని ఐజయ్య ప్రశ్నించారు. నంద్యాల నోటిఫికేషన్ వచ్చాకే రోడ్ల విస్తరణ ప్రారంభమైందన్నారు, రోడ్ల వెడల్పు కోసం అక్కడ ఉన్న వ్యాపారులను, స్థానికులను కనీసం సంప్రధించలేదన్నారు. ప్రజల బ్రతుకుదెరువును కూల్చేసిన ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదని ధ్యజమెత్తారు. భూమా నాగి రెడ్డి వైసీపీ కి రాజీనామా సమర్పించి పోటి చేసి ఉంటే బరిలోకి దిగేవాళ్లం కాదని ఆయన స్పష్టంచేశారు. అధికార పార్టీ లేనిపోని ఆశలు కల్పించి పిరాయింపులు ప్రోత్సహించారన్నారు ఎద్దేవా చేశారు.
మరిన్ని వార్తాల కోసం కింద క్లిక్ చేయండి
