ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండబోదని సీబీఐ మాజీ జాయింట్ డెరెక్టర్ లక్ష్మీ నాారాయణ అన్నారు. ఏపీ పరిక్షణ సమితి నిర్వహించిన ఆంధ్రుడా మేలుకో అనే కార్యక్రమానికి ఆయన హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల విధానం అవలంభించాలని అనుకుంటోందని, కానీ దానితో పెద్దగా ప్రయోజనాలు ఉండవని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. అన్ని జిల్లాలు అభివృద్ధి చేయాలని సూచించారు. దీంతోనే సాధికారత సాధ్యం అవుతుందని చెప్పారు. ఈ మూడు రాజధానుల విధానంతో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. బుధవారం ఏపీ పరిక్షణ సమితి నిర్వహించిన ఆంధ్రుడా మేలుకో అనే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఏపీలో కాంగ్రెస్ ను కబ్జా చేసిన సీఎం జగన్ - వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహారాష్ట్ర మాదిరిగా అన్ని జిల్లాలను సమానంగా డెవలప్ చేస్తే ప్రాంతాల మధ్య వివాదాలు తలెత్తబోవని అన్నారు. తాను ఆ రాష్ట్రంలో 22 సంవత్సరాలు పని చేశానని తెలిపారు. అక్కడ అనేక సిటీలు డెవలప్ అయ్యాయని అన్నారు. ముంబాయి, పుణే, థానే, ఔరంగాబాద్, నాగ్‌పూర్, నాసిక్ చుట్టూ ఎన్నో సంస్థలు వచ్చాయని అన్నారు. దీని వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు.
వైసీపీలో భారీగా పదవుల మార్పులు, చేర్పులు.. 8 జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకం..
ఆ రాష్ట్ర ప్రజలు వేరే రాష్ట్రాల్లో ఎక్కువగా ఉద్యోగాల కోసం వెళ్లరని అన్నారు. కానీ ఇక్కడి ప్రజలు వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోనూ ఇలాంటి విధానమే అవలంభిస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఉపాధి కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబాయిలో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఉంటుందని తెలిపారు. అలాగే మరో రెండు సిటీలు అయిన నాగ్‌పూర్, ఔరంగాబాద్‌లో రెండు బెంచ్‌లు ఏర్పాటు చేశారని లక్ష్మీనారాయణ అన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని ఒక జిల్లా ఒక రంగంలో ప్రతిభ కనబరుస్తోందని అన్నారు.
ఏపీసీసీ చీఫ్‌గా గిడుగు రుద్రరాజు.. తులసిరెడ్డి, హర్షకుమార్, పల్లంరాజులకు కీలక పదవులు
అలాగే ఏపీ రాజధాని అమరావతిలో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ పెట్టాలని ఆయన సూచించారు. విశాఖ, కర్నూలు జిల్లాలో మరో రెండు బెంచ్ లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీబీఐ మాజీ జేడీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ వింటర్ సెషన్స్ పెట్టుకోవచ్చని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఒకే ప్రదేశంలో అన్ని విధాల ఆఫీసులు ఉంటాయని అన్నారు. కానీ ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎందుకు అలా ఆలోచించడం లేదని తెలిపారు.
