ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) బుధవారం ఆదేశాలు జారీ చేసింది. 

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు మాజీ మంత్రి సాకే శైలజా నాథ్ ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

అలాగే 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది. దీనితో పాటు 34 మందితో కో ఆర్డినేషన్ కమిటీని కూడా నియమించింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్‌వలి, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ , పి రాకేశ్, ప్రోగ్రామ్ కమిటీ ఛైర్మన్‌గా పల్లంరాజు, ప్రచార కమిటీ ఛైర్మన్‌గా జీవీ హర్షకుమార్, మీడియా కమిటీ ఛైర్మన్‌గా తులసి రెడ్డిలను నియమించారు.