Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో కాంగ్రెస్ ను కబ్జా చేసిన సీఎం జగన్ - వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు

ఏపీలో కాంగ్రెస్ పార్టీని సీఎం జగన్ కబ్జా చేశారని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అందుకే ఆయన పార్టీకి అన్ని అన్ని ఓట్లు వచ్చాయని ఆరోపించారు. 

CM Jagan - YCP MP Raghuramakrishna Raju who captured the Congress in AP
Author
First Published Nov 24, 2022, 9:01 AM IST

ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా కబ్జా చేశారని వైసీపీ రెబర్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. అలా చేయడం వల్లే ఆయనకు అన్ని ఓట్లు వచ్చాయని అన్నారు. సీఎం జగన్ తనను తాను ఎన్టీ రామారావు, ఎంజీఆర్ తో పోల్చుకుంటున్నారని తెలిపారు. ఇది విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన దేశ రాజధాని ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

వైసీపీలో భారీగా పదవుల మార్పులు, చేర్పులు.. 8 జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకం..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో ఎవరో పార్టీ ఏర్పాటు చేస్తే, దానిని సీఎం జగన్ కొనుగోలు చేశారని ఆరోపించారు. ఆ పార్టీకి కాంగ్రెస్ పేరు చివరిలో పెట్టడం నిజం కాదాన అని రఘురామ అన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సౌమిత్వ పథకాన్ని ఏపీ ప్రభుత్వం జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంగా మార్చిందని తీవ్రంగా రఘురామ ఆరోపించారు. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి తన ఫోన్‌ పోయిందని చెబుతున్నారని అన్నారు. ఈ పరిణామాన్ని గమనిస్తే లిక్కర్ స్కాంలో త్వరలోనే విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేస్తారని అవగమతవుతోందని ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios