చిత్తూరు: చిత్తూరు జిల్లా రామకుప్పంలో కలకలం సృష్టించిన నాగరాజు అనే వ్యక్తి హత్య కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగరాజు హత్య కేసులో కీలక సూత్రధారి అతని భార్య సౌమ్య అని పోలీసులు గుర్తించారు. 

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న అక్కసుతో భర్త అడ్డు తొలగించాలని సౌమ్య పన్నాగం పన్నింది. సమీపంలోని జనార్థన్ అనే వ్యక్తితో సౌమ్య వివాహేతర సంబంధం నెరపుతోంది. 

ప్రియుడిని కలుసుకోకుండా భర్త నాగరాజు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అతని అడ్డు తొలగించుకుంటే తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించిన సౌమ్య నాగరాజు హత్యకు సుపారి ప్లాన్ వేసింది. ప్రియుడు జనార్థన్ తో కలిసి భర్తను హత్య చేస్తే లక్ష సుఫారీ ఇస్తానని చెప్పింది. 

అందులో భాగంగా ఒక ముఠాతో మాట్లాడుకుని వారికి రూ.20 వేలు అడ్వాన్స్ ఇచ్చింది. అడ్వాన్స్ తీసుకున్న నిందితులు ఏప్రిల్ 30న నాగరాజును హతమార్చారు. హత్యకు ప్లాన్ వేసిన నిందితురాలు సౌమ్యతోపాటు ప్రియుడు జనార్థన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు.