కాకినాడలో ఘోరం జరిగింది. ఓ కుమారుడు కోపంతో తన తల్లిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. అనంతరం తన శరీరంపై కూడా పెట్రోల్ పోసుకున్నాడు. తరువాత మంట అంటించుకోవడంతో అతడు కూడా చనిపోయాడు.
క్షణికావేశం రెండు ప్రాణాలను బలితీసుకుంది. ఓ కుమారుడు ఏకంగా కన్న తల్లికి నిప్పంటించాడు. అనంతరం తనపై కూడా పెట్రోలో పోసుకొని మంట వెలిగించుకున్నాడు. దీంతో అతడికి కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో ఇద్దరూ చనిపోయారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది.
మంత్రి ఆదిమూలపు సురేష్‌కు అస్వస్థత.. పరామర్శించిన సీఎం జగన్
కాకినాడ జిల్లా కేంద్రంలో తల్లీ కుమారుడి మృతి కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పలు వివరాలు అందించారు. కాకినాడ పట్టణం (kakinada) జెండా సెంటర్ లో రాసాని సీతమ్మ (rasani seethamm), రాసాని గోపాలం (rasani gopalam) అనే ఇద్దరు తల్లీ కొడుకులు జీవిస్తున్నారు. ఇందులో తల్లి సీతమ్మ వయస్సు 50 సంవత్సరాలు కాగా.. కుమారుడు గోపాలం వయస్సు 42 సంవత్సరాలు. అయితే ఈ తల్లీకొడుకుల మధ్య కొంత కిందట విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి కాస్త ముభావంగానే ఉంటున్నారు. పలు సందర్భాల్లో ఇద్దరి మధ్య గొడవలు కూడా అవుతున్నాయి.
ఇదే క్రమంలో శనివారం కూడా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే ఈ గొడవ జరుగుతున్న సమయంలో గోపాలం తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయారు. దీంతో ఒక్క సారిగా తల్లిపై పెట్రోల్ పోశాడు. అనంతరం తనపై కూడా పోసుకున్నాడు. వెంటనే నిప్పటించుకున్నాడు. ఇవ్వన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. దీంతో ఇద్దరి శరీరాలకు మంటలు అంటుకున్నాయి. మంటలు వారిని మొత్తం కమ్మేయడంతో చివరికి ఇద్దరు అక్కడే చనిపోయారు. తరువాత దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు అక్కడికి స్థలానికి చేరుకున్నారు. ఘటన జరిగిన తీరును అంచనా వేశారు. తల్లీకొడుకుల మృతదేహాలను కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
