అందుకే....ఒక్కడితో సరిపెట్టుకున్నారట

First Published 20, Apr 2017, 8:23 AM IST
The secret of Naidus single child norm
Highlights

అప్పటికే రాజకీయాల్లో బాగా బిజీగా ఉండటం వల్ల ఇద్దరు సంతానం వద్దనుకున్నామన్నారు.  

లోకేష్ ఒక్కడితోనే ఫుల్ స్టాప్ పెట్టానికి చంద్రబాబునాయుడు ఈరోజు కారణం చెప్పారు. రాజకీయాల్లో చాలా బిజీగా ఉండటంతో...ఒక్క బిడ్డ మాత్రమే చాలనుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తన భార్య, తండ్రి కూడా తన నిర్ణయంతో ఏకీభవించారని అన్నారు. అయితే తన అత్తగారు మాత్రం తమ నిర్ణయాన్నివ్యతిరేకించారని కూడా చెప్పారు. అప్పటికే రాజకీయాల్లో బాగా బిజీగా ఉండటం వల్ల ఇద్దరు సంతానం వద్దనుకున్నామన్నారు.  

లోకేష్ స్టాన్ ఫోర్డ్ లో చదువుతున్నప్పుడు తనకు అతని పెళ్లి గురించి ఆలోచన వచ్చిందని బాబు తెలిపారు. ఆ తర్వాత తన భార్యతో చర్చించానని... అనంతరం బావమరది అయిన బాలయ్యను కదిపామని చెప్పారు. అయితే, బ్రహ్మణి చదువు పూర్తి కాకపోవటంతో బాలయ్య అప్పుడు అంగీకరించలేదన్నారు. దాంతో బాలకృష్ణకు నచ్చచెప్పటానికి కొంచెం సమయమే పట్టిందని చెప్పారు.

loader