అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఫైర్ బ్రాండ్ గా పేరొందిన సోము వీర్రాజును ఏపీ బీజేపీ చీఫ్ గా కమలదళం నియమించింది.

ఏపీ రాష్ట్రంలో వచ్చే  అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని బలోపేతం చేయాలని  కమలదళం ప్లాన్ చేస్తోంది.  సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తైన తర్వాత బీజేపీ చీఫ్ పదవిలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణను తొలగించి సోము వీర్రాజును నియమించారు.

ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకొంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కూడ పొత్తు ఉంటుందని ఈ రెండు పార్టీల నేతలు  ప్రకటించారు. తొలి నుండి పార్టీ విధేయుడిగా 

2018 మేలో  కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ చీఫ్ గా నియమించింది కమలదళం. రెండేళ్ల పాటు ఈ పదవిలో ఆయన కొనసాగాడు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై కన్నా లక్ష్మీనారాయణ దూకుడుగా వ్యవహరించాడు.

కన్నా లక్ష్మీనారాయణ కంటే సోము వీర్రాజు ఇంకా దూకుడుగా వ్యవహరించే తత్వం కలవాడు.  దీంతో ఆయనకు ఫైర్ బ్రాండ్‌గా పేరుంది. ఏపీ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకుగాను సోము వీర్రాజును బీజేపీ చీఫ్ గా నియమించారు. 

మొదటి నుండి పార్టీకి విధేయుడిగా సోము వీర్రాజు ఉన్నారు.  ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం మరో ఎమ్మెల్సీ మాధవ్ పేరును కూడ బీజేపీ నాయకత్వం పరిశీలించింది. కానీ చివరకు సోము వీర్రాజుకు కమలదళం అవకాశాన్ని ఇచ్చింది.

ఏపీ రాష్ట్రంలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలోని రెండు ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టి అధికారాన్ని చేపట్టాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.ఇందులో భాగంగానే జనసేనతో ఆ పార్టీ పొత్తు పెట్టుకొంది.

ఇప్పటికే కొందరు టీడీపీ నుండి ముగ్గురు ఎంపీలు బీజేపీలో చేరారు. మరికొందరు టీడీపీ నేతలు కూడ బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. బీజేపీ ఏ పార్టీనైనా కాషాయమయం చేస్తోందని ఇటీవల కాలంలో ఏపీ బీజేపీ ఇంచార్జీ సునీల్ దియోధర్ ట్వీట్ చేశారు.

also read:కన్నా లక్ష్మినారాయణకు షాక్: ఏపీ బిజెపి కొత్త చీఫ్ సొము వీర్రాజు

తెలంగాణ రాష్ట్రంలో కూడ బీజేపీ నాయకత్వాన్ని మార్చింది. లక్ష్మణ్ స్థానంలో దూకుడుగా ఉండే ఎంపీ బండి సంజయ్ ను బీజేపీ జాతీయ నాయకత్వం అప్పగించింది. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగానే ఏపీ రాష్ట్రంలో కూడ  దూకుడుగా వ్యవహరించే సోము వీర్రాజుకు పార్టీ నాయకత్వం పగ్గాలు అప్పగించింది.

1998 పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో బీజేపీకి మంచి ఓట్లు, సీట్లు వచ్చాయి. 1999 ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేశాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో స్వంతంగా బీజేపీ పోటీ చేసినా ఆశించిన ఓట్లు సీట్లు రాలేదు. 

రాష్ట్రంలో రాజకీయ శక్తిగా ఎదగాలని బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్దం చేస్తోంది.ఈ క్రమంలోనే వీర్రాజుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షపదవిని కట్టబెట్టినట్టిందని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.