Andhra Pradesh: ఆంధప్రదేశ్ రాజకీయాల్లో పెగాసెస్ వ్యవహారం దూమారం రేపుతోంది. చంద్రబాబు హయాంలో పెగాసస్ స్పైవేర్ కొన్నారని బెంగాల్ సీఎం మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో ప్రకంపనలు మొదలయ్యాయి. అధికార వైకాపా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ సభ్యుల సస్పెన్షన్.. పెగాసస్ స్పైవేర్.. కల్తీ మద్యం అంశాలు రాజకీయ కాకరేపుతున్నాయి.
Andhra Pradesh: ఆంధప్రదేశ్ రాజకీయాల్లో పెగాసెస్ వ్యవహారం దూమారం రేపుతోంది. చంద్రబాబు హయాంలో పెగాసస్ స్పైవేర్ కొన్నారని బెంగాల్ సీఎం మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో ప్రకంపనలు మొదలయ్యాయి. అధికార వైకాపా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ సభ్యుల సస్పెన్షన్.. పెగాసస్ స్పైవేర్.. కల్తీ మద్యం అంశాలు రాజకీయ కాకరేపుతున్నాయి.
చంద్రబాబు ట్యాపింగ్ కు పాల్పడలేదా? : అంబటి రాంబాబు
వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్ ఇచ్చారు తెలుగుదేశం నేతలు. రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ట్యాపింగ్ కార్యక్రమాలకు పాల్పడలేదా? అని ప్రశ్నించారు. పెగాసస్‌పై విచారణ జరిగితే అసలు విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. పెగాసస్‌పై టీడీపీ ఎందుకు కంగారు పడుతోంది? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగానే పెగాసస్ స్పైవేర్‌ను వాడినట్టు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పంష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన రాంబాబు.. చంద్రబాబు జీవితమంతా అనైతిక రాజకీయాలే చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వాస్తవాలు తెలుసుకో ర్యాంబో రాంబాబు : బీటెక్ రవి
ఇక అంబటి వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలుకుతున్నాయి. తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు బీటెక్ రవి.. అధికార పార్టీ తీరుపై మండిపడ్డారు. ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. అంబటికి చురకలంటించారు. పెగాసిస్ స్పైవేర్ పై తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ వల్లె వేయడం కాదు....వాస్తవాలు తెలుసుకో ర్యాంబో రాంబాబు అంటు విమర్శించారు. పెగాసిస్ సాఫ్ట్ వేర్ ప్రభుత్వాలకు తప్ప వ్యక్తిగతంగా ఎవరికీ విక్రయించరన్న విషయం తెలుసుకొని మాట్లాడండి అని రాంబాబుకు సూచించారు.
చంద్రబాబునాయుడు హయాంలో పెగాసస్ స్పైవేర్ సాఫ్ట్ వేర్ ను కొని ఉంటే రికార్డుల్లో ఉంటుంది... ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది కదా నిరూపించండి అంటూ బీటెక్ రవి సవాల్ విసిరారు. అలాంటి సాఫ్ట్ వేర్ ఏమీ గతంలో కొనుగోలు చేయలేదని గౌతమ్ సవాంగ్ కార్యాలయం ఆర్టీఐకి ఇప్పటికే సమాధానంగా చెప్పిందనీ, ఒకసారి ఆ విషయాలను సరిచూసుకోండి అంటూ హితవు పలికారు. ఒకవేళ నిజంగా అటువంటి సాఫ్ట్ వేర్ వాడి ఉంటే ప్రభుత్వం మీచేతిలోనే ఉంది కదా.. దీనిని నిరూపించి బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చు... ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేతగాని వారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కల్తీసారా మరణాలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు పెగాసిస్ పేరుతో చంద్రబాబుపై మరోమారు బురదజల్లే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు. సోది కబుర్లు ఆపి కల్తీసారా మరణాలపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపి వాస్తవాలను నిగ్గుతేల్చండి అంటూ మండిపడ్డారు. ప్రజలను ఎల్లకాలం అబద్దాలతో నమ్మించలేరని ర్యాంబో రాంబాబు గుర్తిస్తే మంచిదని హితవు పలికారు.
పెగాసస్ కొనుగోలు చేసివుంటే మీరు అధికారంలోకి వచ్చేవారా? : నారా లోకేశ్
పెగాసస్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మాట్లాడుతూ.. ''పెగాసెస్ సాప్ట్ వేర్ ను టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందనే ఆరోపణల్లో ఎలాంటి నిజాలు లేవు. ఇలాంటి చట్ట వ్యతిరేక పనులను మా నాయకుడు చంద్రబాబు ఎప్పుడూ అనుమతించరు. నిజంగానే పెగాసెస్ సాఫ్ట్ వేర్ మేం కొనుగోలు చేసివుంటే జగన్ అధికారంలోకే వచ్చేవారా..? మాపై చర్యలు తీసుకోకుండా జగన్ మూడేళ్లపాటు ఆగి ఉండేవారా..?'' అని పేర్కొన్నారు. ''టీడీపీ తప్పులు వెతకడానికి అధికారంలోకి వచ్చిన వెంటనే ఐటీ సహా అన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లను జగన్ తనిఖీలు చేయించారు. కానీ ఎక్కడా మేము తప్పుచేసినట్లు బైటపడలేదు. కానీ టీడీపీ ప్రభుత్వం పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిజంగానే కామెంట్ చేసి ఉంటే ఆమెకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్లి ఉండొచ్చు'' అన్నారు.
