ఇద్దరు యువతులు గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమనుకున్నారు. పెద్దలకు చెబితే ఎలాగో ఒప్పుకోరనుకున్నారేమో.. ఇంట్లోనుండి పారిపోయారు. ఈ వింత సంఘటన కర్నూలులో అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది.

వివరాల్లోకి వెడితే.. కర్నూలు సంతోష్ నగర్‌కు చెందిన 21 యేళ్ల యువతి, నర్సింహ రెడ్డి నగర్‌కు చెందిన 20 యేళ్ల యువతి ఇంట్లో నుండి పరారయ్యారు. ఎందుకు పారిపోయారు. ఎక్కడికి వెళ్లారో తెలియక ఇరు కుటుంబాలు ఆందోళన చెందాయి. 

అయితే చిన్ననాటి నుంచి స్నేహితులైన ఆ యువతులు వెళ్తూ వెళ్తూ ఓ చిన్న మెసేజ్ వదిలివెళ్లారు. అది వారి కుటుంబాన్ని షాక్ కు గురి చేసింది. చిన్ననాటి స్నేహం పెద్దగా అయినా కొద్ది ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు.

ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టి వారిద్దరూ పారిపోయారు.  దీంతో ఇరువురి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి యువతుల కోసం దర్యాప్తు చేపట్టారు.