Asianet News TeluguAsianet News Telugu

అక్క కూతురిని రెండో పెళ్లి చేసుకోవాల‌ని బావ‌ను చంపిన బావ మ‌రిది.. ఎక్క‌డంటే ?

గత నెల చివరిలో పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. మృతుడిని అతడి బావ మరిది, పలువురి సహాయంతో హత్య చేశాడని పోలీసులు తెలిపారు. 

The brother-in-law who killed his brother-in-law to marry his sister's daughter for the second time.. Where is it?
Author
First Published Oct 5, 2022, 1:45 PM IST

అత‌డికి కొంత కాలం కిందట పెళ్లి అయ్యింది. తన అక్క కూతురును రెండో పెళ్లి చేసుకోవాల‌ని దుర్భుద్ధి పుట్టింది. ఈ విష‌యాన్ని త‌న బావ‌కు తెలియ‌జేశాడు. దీనికి బావ నిరాక‌రించాడు. త‌న కూతురును ఇచ్చి రెండో పెళ్లి చేయ‌బోన‌ని తేల్చి చెప్పాడు. దీంతో ఆగ్ర‌హించిన బావ‌మ‌రిది ప‌థ‌కం ప్ర‌కారం బావ‌ను హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

2జీ స్కామ్: సీబీఐ మొద‌టి ఛార్జిషీట్ దాఖలు.. రాజానే 'మాస్టర్ మైండ్'

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలను దేవరపల్లిలోని సర్కిల్ ఆఫీసులో అడిష‌న‌ల్ ఎస్పీ గోగుల వెంకటేశ్వ‌రావు మీడియాకు మంగ‌ళ‌వారం వెల్ల‌డించారు. బుట్టాయగూడెం మండలంలోని సురాజుపల్లికి చెందిన ఆదిమూలపు ఏసుపాదం సంవ‌త్స‌రం కిందట ఓ మ‌హిళ‌ను వివాహం చేసుకున్నాడు. ఆ దంప‌తుల‌కు ఒక కూతురు జ‌న్మించింది. అయితే కొంత కాలం నుంచి త‌న అక్క బిడ్డ‌ను పెళ్లి చేసుకోవాల‌ని భావిస్తున్నాడు. 

ఈ క్ర‌మంలో భార్య‌ను త‌ల్లిగారింటికి పంపించేశాడు. అక్క కూతురును వివాహం చేసుకోవాల‌ని ఉంద‌ని త‌న బావ అయిన మ‌ల్లోజు రాజుకు విష‌యం చెప్పాడు. దీనికి ఆయ‌న ఆగ్ర‌హించాడు. త‌న కూతురును ఇవ్వ‌బోన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు. దీంతో కోపం పెంచుకున్న ఏసుపాదం త‌న బావ‌ను చంపాల‌ని భావించాడు. దీనికి త‌న ఫ్రెండ్స్ స‌హాయం తీసుకున్నాడు దార శ్రీరామచంద్రరావు, బేతాళ శేఖర్, కొలి పవన్ కల్యాణ్ కుమార్ లతో క‌లిసి ఏసుపాదం ఒక ప్లాన్ వేశాడు. రూ.2 ల‌క్ష‌ల‌కు ఒప్పందం కూడా చేసుకున్నాడు.

యూపీలో రాంలీలా వేదికపై అశ్లీల నృత్యాలు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ప్లాన్ లో భాగంగా ఏసుపాదం త‌న బావ అయిన రాజును త‌న గృహానికి ఆహ్వానించాడు. ఈ విష‌యాలేవి తెలియ‌ని రాజు ఇంటికి వ‌చ్చాడు. అనంత‌రం అంద‌రూ క‌లిసి మ‌ద్యం సేవించారు. బ‌య‌ట‌కు వెళ్లి మ‌ద్యం సేవిద్దామ‌ని న‌మ్మించి వారంద‌రినీ కొల్లి ప‌వ‌న్ క‌ల్యాణ్ అనే వ్య‌క్తి త‌న వాహ‌నంలో ఎక్కించుకున్నాడు. అనంత‌రం పోగొండ ప్రాజెక్టు వ‌ద్ద‌కు చేరుకున్నారు. అక్క‌డ ఐర‌న్ రాడ్ తో రాజు త‌ల వెన‌క దిక్కు బ‌లంగా కొట్టారు. దీంతో బాధితుడు చ‌నిపోయాడు. 

హ‌త్య విష‌యాలు బ‌య‌ట‌కు రాకుండా ఉండేందుకు డెడ్ బాడీని వాహ‌నంలో ఎక్కించుకున్నారు. ద‌గ్గ‌ర‌లో ఉన్న గోపాలపురం - భీమోలు రోడ్డు వ‌ద్ద‌కు చేరుకున్నాడు. పోలవరం రైట్ కెనాల్ ద‌గ్గ‌రకు వ‌చ్చి మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీశారు. అనంత‌రం పెట్రోల్ పోసి మంట‌పెట్టారు. త‌రువాత అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.

ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన పెళ్లి బృందం బస్సు.. 32కు పెరిగిన మృతుల సంఖ్య

ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు. టెక్నాల‌జీని ఉప‌యోగించి నిందితుల‌ను ప‌ట్టుకున్నారు. నిందితుల నుంచి ఐర‌న్ రాడ్డు, న‌గ‌దు, కారు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. కాగా ఈ హ‌త్య కేసులో ప్ర‌మేయం ఉన్న  రామచంద్రరావు, బేతాళ శేఖర్ పై గ‌తంలో కేసులు న‌మోదై ఉన్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios