వైసీపీ అధికారం చేపట్టిన రెండున్నరేళ్ల తరువాత అయినా ప్రతిపక్షాలను గుర్తించినందుకు వైఎస్ జగన్ కు ధన్యవాదాలని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.
ఏపీలో అధికారం చేపట్టిన రెండేళ్ల తరువాత ప్రతిపక్షాలను గుర్తించినందుకు ఏపీ సీఎం జగన్ కు, ఆయన సలహాదారుడు సజ్జలకు థ్యాంక్స్ అని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.3 వేల పెన్షన్ ఇస్తామని ఎన్నికల సమయంలో వైసీపీ హామీ ఇచ్చిందని అన్నారు. కానీ రూ.250 పెంచి కొత్త పథకంగా దానిని కొత్త పథకంగా వైసీపీ ప్రకటించుకుంటోందని ఆయన విమర్శించారు. జనవరి 1వ తేదీ కొత్త సంవత్సరం సందర్భంగా పలు కొత్త పథకాలను ప్రారంభిస్తున్నట్టు అట్టహాసంగా ప్రకటనలు ఇచ్చారని ఆరోపించారు.
మొన్న కడప.. నేడు విజయనగరం, ఏపీలో మరో ఏఆర్ పోలీస్ అధికారి ఆత్మహత్య
పేదల ఇళ్ల కోసం రూ.10 వేల కోట్లు ఖర్చుపెట్టడాన్ని ఆహ్వానించామని తెలిపారు. తాము మొదటి నుంచీ పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, పల్లెల్లో మూడు సెంట్లు భూమి ఇవ్వాలని చెబుతూ వచ్చామని అన్నారు. రూ. 10 వేల కోట్ల ఇళ్ల స్థలాల కోసమని ఖర్చు చేస్తే అందులో నాలుగు వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. పేదలకు ఇళ్ల స్థలం అమ్ముకోవచ్చని, తాకట్టు పెట్టుకోవచ్చని, తిరిగి దరిద్రంలో కూడా బతకవచ్చని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కట్టించే ఇళ్లలో జగన్ ఒక రోజు ఉండాలని సవాల్ విసిరారు. జగన్ ప్యాలస్ లోని స్నానాల గది ఉన్నంత విస్తీర్ణంలో ఇళ్లు కట్టించి, పేదరికాన్ని ఎలా పారదోలుతారని విమర్శించారు.
ఓటీఎస్ పేరుతో పేదలను ఇళ్లు అమ్ముకునేలా ప్రోత్సహిస్తున్నారని కె.రామకృష్ణ ఆరోపించారు.పేదల ఇళ్ల స్థలాల అవినీతి విషయంలో ఒక ఎంపీని సీఎం జగన్ చెంపపైన కొట్టారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదలను బిచ్చగాళ్లను చేయాలని చూస్తోందని ఆరోపించారు. రెండున్నరేళ్లలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఏ రంగంలోనూ ప్రభుత్వం ప్రగతి సాధించలేదని తెలిపారు. వైసీపీ తన హయాంలో ఏ ప్రాజెక్టు పూర్తి చేసిందో, ఏ పరిశ్రమ ఏపీకి తీసుకొచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మకుండా అడ్డుకోలేకపోయారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వ ఆస్తులను అంబానీకి, అదానీకి కట్టబెడుతున్నారని ఆరోపించారు.
ఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలు.. జగన్ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు, ఆ జీవోపై స్టే
గడిచిన రెండున్నరేళ్లలో ఏ రైతులకైనా క్రాప్ సబ్సిడీ, ఇన్ పుట్ సబ్సిడీ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధరలు ఇచ్చారా అని అన్నారు. మీ పార్టీకి చెందిన రైతు నాయకుడు నాగిరెడ్డిని ఏపీలోని అన్ని జిల్లాలో తిరగాలని సూచించారు. రైతులు సంతోషంగా ఉన్నారా ? అని రైతులను అడగాలని తెలిపారు. ఏపీ సీఎం సలహాదారు తప్ప, రాష్ట్రంలోని ఏ రైతు కూడా సంతోషంగా లేరని అన్నారు. రైతుల సమస్యలపై చర్చించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. అందులో చర్చిండానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అమరావతిలో 5 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యాయని అన్నారు. ఆ ఇళ్లను పేదలకు ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు.ఆ పంపిణీని ఎందుకు అడ్డుపడుతున్నారని అన్నారు. ప్రభుత్వ సలహాదారు కుటుంబంతో కలిసి ప్రభుత్వం పేదలకు కట్టించిన ఇళ్లలో ఒక రోజు ఉండి చూడాలని సవాల్ విసిరారు. అప్పుడే ప్రభుత్వానికి వారి బాధలు అర్థమవుతాయని అన్నారు.
