విజయనగరం జిల్లా హోమ్‌ గార్డ్స్‌ విభాగం ఏఆర్‌ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈశ్వర్‌రావు  (eshwar rao) పోలీస్‌ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తన వద్ద ఉన్న సర్వీస్‌ రివాల్వర్‌తో రెండు రౌండ్లు కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 

విజయనగరంలో (vizianagaram) విషాదం చోటు చేసుకుంది. హోమ్‌ గార్డ్స్‌ విభాగం ఏఆర్‌ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయనగరం జిల్లా హోమ్‌ గార్డ్స్‌ విభాగం ఏఆర్‌ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈశ్వర్‌రావు (eshwar rao) పోలీస్‌ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తన వద్ద ఉన్న సర్వీస్‌ రివాల్వర్‌తో రెండు రౌండ్లు కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం ఆయన మృతదేహాన్ని విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే ఈశ్వర్ రావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

కాగా.. కొద్దిరోజుల క్రితం కడపలోనూ (kadapa) ఏఆర్‌ ఎస్‌ఐగా పని చేస్తున్న చంద్రరావు (25) (chandra rao) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లాకు (srikakulam district) చెందిన చంద్రరావు కడపలో ఒంటరిగా ఉంటున్నారు. ఆయన ఆత్మహత్యకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. కుటుంబ సమస్యలతోనే చంద్రరావు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.