ఏపీలోని గీతం యూనివర్సిటీ వద్ద తెల్లవారుజాము రెండుగంటలనుంచి ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. 

విశాఖపట్నం : మరోసారి ఏపీలోని విశాఖపట్నం గీతం యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రెవెన్యూ అధికారులు గీతం వర్సిటీలోని కొంత స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తించి కంచె నిర్మాణం చేపడుతున్నారు. కంచె నిర్మాణానికి కావలసిన సామాగ్రిని పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ సిబ్బంది యూనివర్సిటీలోకి తీసుకువెళ్లారు. గీతం యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్ లో ఉన్న మెడికల్ కాలేజ్ దగ్గర కిలోమీటర్ మేర ఈ కంచె వేస్తున్నారు. 

దీంతో తెల్లవారుజామున రెండు గంటల నుంచి గీతం యూనివర్సిటీకి చెందిన అన్ని రోడ్లమీద పోలీసులు ఆంక్షలు విధించారు. గీతం యూనివర్సిటీ కి రెండు కిలోమీటర్ల ముందు నుంచే బారికేడ్లు ఏర్పాటు చేశారు. అటువైపుగా ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. స్థానికులు కూడా తమ ఐడి కార్డులు చూపిస్తే కానీ ఆ మార్గంలో పంపించడం లేదు. పోలీసుల ఈ ఆంక్షలతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు, కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గీతం కాలేజీకి ఆనుకుని ఉన్న 14 ఎకరాల భూమిని ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. కొత్త డ్రామాకు స్కెచ్, ఆయనలా మేం డబ్బాలు కొట్టుకోం: కేసీఆర్‌పై జీవీఎల్ ఫైర్