విశాఖ చెస్ట్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత: వ్యాక్సిన్ కోసం వృద్దుల పడిగాపులు
విశాఖపట్టణంలోని చెస్ట్ ఆసుపత్రి వద్ద కరోనా వ్యాక్సిన్ కోసం వచ్చినవారికి వ్యాక్సిన్ అందించడకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
విశాఖపట్టణం: విశాఖపట్టణంలోని చెస్ట్ ఆసుపత్రి వద్ద కరోనా వ్యాక్సిన్ కోసం వచ్చినవారికి వ్యాక్సిన్ అందించడకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. విశాఖపట్టణంలోని వృద్దులకు గురువారం నాడు కరోనా సెకండ్ డోస్ ఇస్తామని వైద్య శాఖాధికారులు ప్రకటించారు. దీంతో గురువారం నాడు ఉదయం వరకే వృద్దులు చెస్ట్ ఆసుపత్రికి చేరుకొన్నారు. వ్యాక్సిన్ తీసుకొనేందుకు ఆసుపత్రి వద్ద వృద్దులు బారులు తీరారు. వ్యాక్సిన్ తీసుకొనేందుకు వచ్చినవారికి ఆసుపత్రి సిబ్బంది నుండి సరైన సమాధానం లభించలేదు. పైగా ఆసుపత్రి సిబ్బంది తమ పట్ల దురుసుగా వ్యవహరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉదయం ఆరు గంటల నుండి ఆసుపత్రి వద్దే ఎదురుచూస్తున్నా వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో సరైన సమాధానం ఇవ్వకపోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వద్ద క్యూ లైన్ పెరిగిపోయింది. కానీ వ్యాక్సిన్ విషయమై ఆసుపత్రి సిబ్బంది నుండి సరైన సమాధానం లభించడం లేదని వారు చెప్పారు. లైన్లో నిలబడి కొందరు వృద్దులు స్పృహ కోల్పోయారు.వ్యాక్సిన్ ను వెంటనే అందించాలని సీనియర్ సిటిజన్లు ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.