ఏలూరు జిల్లా వీరమ్మకుంట సర్పంచ్ ఎన్నిక: టీడీపీ, వైసీపీ పోటా పోటీ ప్రచారం, ఉద్రిక్తత

ఏలూరు జిల్లాలోని  పెదపాడు మండలం వీరమ్మకుంట సర్పంచ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా  గ్రామంలో  ఉద్రిక్తత నెలకొంది.  టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది

Tension Prevails  at Veerammakunta after  TDP, YSRCP Workers  Clashes  in Eluru District lns

ఏలూరు: జిల్లాలోని  పెదపాడు మండలం  వీరమ్మకుంటలో  బుధవారంనాడు ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికకు సంబంధించి టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.  ఇవాళ సాయంత్రం  వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి , మాజీ ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ లు తమ అనుచరులతో  ఎదురు పడడంతో ఉద్రిక్తత చోటు  చేసుకుంది. ఇరు వర్గాలు ఎదురుపడిన సమయంలో  రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట చోటు  చేసుకుంది.  దీంతో  ఇరు వర్గాలను  పోలీసులను  అక్కడి నుండి పంపే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో  వీరమ్మకుంటలో  ఉద్రిక్తత చోటు  చేసుకుంది.

ఈ గ్రామ సర్పంచ్ ఎన్నిక కోసం  ఇవాళ్టి ప్రచారాన్ని  టీడీపీ, వైఎస్ఆర్‌సీపీలు ప్రారంభించాయి.  గ్రామంలో  ఒకవైపు నుండి టీడీపీ, మరో వైపు నుండి వైఎస్ఆర్‌సీపీ ఎన్నికల  ప్రచారాన్ని ప్రారంభించాయి. అయితే  ఈ రెండు ర్యాలీలు గ్రామంలో  ఒక చోట  ఎదురు పడ్డాయి. దీంతో  రెండు వర్గాల మధ్య తోపులాట చోటు  చేసుకుంది. ఎన్నికలను  పురస్కరించుకొని  గ్రామంలో  పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో  ఇరువర్గాలను  అదుపు చేశారు.  అయితే  గ్రామంలో  ఉద్రిక్తత నెలకొంది. దీంతో  గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు  చేసుకోకుండా  పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios