కడప ఎంపి హౌస్ అరెస్ట్: పులివెందులలో ఉద్రిక్తం

First Published 6, Mar 2018, 10:32 AM IST
Tension mounting as police house arrested kadapa mp avinash reddy
Highlights
  • ఆదివారం మధ్యాహ్నం అరెస్టు చేసిన పోలీసులు మళ్ళీ ఈరోజు వరకూ బయటకు వెళ్ళటానికి అంగీకరించటం లేదు. ఎంపి ఇంటి చుట్టూ పోలీసులు భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.

కడప వైసిపి ఎంపి అవినాష్ రెడ్డిని పోలీసులు ఇంట్లో నుండి బయటకు వదలటం లేదు. అంటే గత మూడు రోజుల నుండి ఎంపిని పోలీసులు హౌస్ అరెస్టు చేసేసారు.  ఆదివారం మధ్యాహ్నం అరెస్టు చేసిన పోలీసులు మళ్ళీ ఈరోజు వరకూ బయటకు వెళ్ళటానికి అంగీకరించటం లేదు. ఎంపి ఇంటి చుట్టూ పోలీసులు భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఎంపి ఇంట్లోకి పార్టీ నేతలను ఎవరినీ వెళ్ళనీయటం లేదు. పైగా ఎంపి ఇంటి దగ్గరే టిడిపి నేతలు కూడా కనిపిస్తున్నారు. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే ఎంపిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచినట్లు అర్ధమైపోతోంది.

హౌస్ అరెస్టు వల్ల సోమవారం ఢిల్లీలోని సంసద్ మార్గ్ లో జరిగిన ధర్నాకు కానీ పార్లమెంటు సెషన్ కు కూడా ఎంపి హాజరుకాలేకపోతున్నారు.

ఇంతకీ ఎంపిని పోలీసులు ఎందుకు గృహ నిర్బంధంలో ఉంచారు? అంటే, పులివెందుల అభివృద్ధిపై మొన్నటి ఆదివారం నాడు టిడిపి నేత సతీష్ రెడ్డి-అవినాష్ మధ్య బహిరంగ చర్చ జరగాల్సుంది. అభివృద్ధిపై ముందు సవాలు చేసింది సతీషే. సతీష్  చేసిన సవాలును ఎంపి అంగీకరించారు. దాంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగేశారు.

ఆదివారం జరగాల్సిన చర్చను అడ్డుకున్నారు. ముందు జాగ్రత్తగా ఎంపిని అరెస్టు చేసి పోలీస్టేషన్ తరలించారు. తర్వాత ఇంటకి తీసుకొచ్చారు. అంతే అప్పటి నుండి ఎంపిని ఇంట్లో నుండి బయటకు అనుమతించటం లేదు. దాంతో వైసిపి నేతలు, శ్రేణులు మండిపడుతున్నారు. ఎప్పైతే వైసిపి-టిడిపి నేతలు, కార్యకర్తలు ఎంపి ఇంటి వద్దే చేరారో పులివెందులలో పరిస్ధితి ఉద్రిక్తతంగా మారింది. ముందుజాగ్రత్తగా పోలీసులు పట్టణంలో 144 సెక్షన్ విధించారు. దాంతో ఎప్పుడేమవుతుందో అర్ధం కావటం లేదు.

loader