MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Andhra Pradesh
  • IMD Rain Alert: మ‌ళ్లీ దంచికొట్ట‌నున్న వ‌ర్షాలు.. ఏపీలో ఈ ప్రాంతాల‌కు అల‌ర్ట్

IMD Rain Alert: మ‌ళ్లీ దంచికొట్ట‌నున్న వ‌ర్షాలు.. ఏపీలో ఈ ప్రాంతాల‌కు అల‌ర్ట్

IMD Rain Alert: గ‌త కొన్ని రోజులుగా విప‌రీత‌మైన చలితో ఇబ్బంది ప‌డుతోన్న ఏపీ ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆదివారం వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. దీంతో వాతావర‌ణంలో భారీగా మార్పులు చోటు చేసుకునే అవ‌కాశంద‌ని చెబుతోంది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jan 25 2026, 06:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బంగాళాఖాతం తూర్పుగాలుల ప్రభావం
Image Credit : Gemini AI

బంగాళాఖాతం తూర్పుగాలుల ప్రభావం

బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పు దిశ గాలుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ గాలుల ప్రభావంతో వ‌చ్చే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్ష సూచన
Image Credit : Getty

దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్ష సూచన

వాతావరణ శాఖ సమాచారం ప్రకారం దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమ ప్రాంతాల్లో ఆదివారం (ఈ రోజు) చెదురుమదురు వర్షాలు కురవొచ్చు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకునే అవకాశం ఉండగా, కొన్ని చోట్ల స్వల్పం నుంచి మోస్తరు వర్షం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

35
ఉత్తర కోస్తాలో పొగమంచు హెచ్చరిక
Image Credit : Asianet News

ఉత్తర కోస్తాలో పొగమంచు హెచ్చరిక

ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పొగ‌మంచు కార‌ణంగా రోడ్డు ప్రమాదాల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

45
ఉష్ణోగ్రతలు తగ్గి చలి ప్రభావం
Image Credit : Getty

ఉష్ణోగ్రతలు తగ్గి చలి ప్రభావం

రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పడిపోవచ్చని అంచనా. దీని వల్ల చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అల్లూరి జిల్లా పరిధిలో కనిష్ఠ ఉష్ణోగ్రత 6.3 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఇది ఈ సీజన్‌లో నమోదైన తక్కువ ఉష్ణోగ్రతల్లో ఒకటిగా అధికారులు పేర్కొన్నారు.

55
ఎల్‌నినో ప్రభావంపై స్కైమెట్ అంచనా
Image Credit : Pixabay

ఎల్‌నినో ప్రభావంపై స్కైమెట్ అంచనా

ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ఈ ఏడాది వర్షాల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో బలహీన లానినా పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇవి క్రమంగా తగ్గుతూ వచ్చే నెలలో తటస్థ స్థితికి చేరనున్నట్లు అంచనా. ఏప్రిల్ నుంచి ఎల్‌నినో వైపు పరిస్థితులు మారే అవకాశం ఉండగా, జూలై నెలాఖరుకు ఎల్‌నినో ఏర్పడుతుందని స్కైమెట్ తెలిపింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాల కాలంలో వర్షాలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. దీనిపై మార్చి నెలలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
వాతావరణం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Andhra Ooty: ఆంధ్ర ఊటీ.. అరకులో తప్పకుండా చూడాల్సిన టాప్ 10 ప్రదేశాలు ఇవే
Recommended image2
Now Playing
NO విడాకులు.. NO డౌట్స్! | TDP - Janasena Alliance News | Asianet News Telugu
Recommended image3
Now Playing
లోకేష్ ని ఆటపట్టిస్తున్న పిల్లలు | Nara Lokesh | Asianet News Telugu
Related Stories
Recommended image1
SIP: రూ. 5వేల‌తో మొదలు పెట్టి కోటి రూపాయ‌లు కూడ‌బెట్టొచ్చు.. మాయా లేదు, మంత్రం లేదు.. సింపుల్ లాజిక్
Recommended image2
Zodiac sign: ఈ రాశి వారికి వ‌చ్చే వారం అనుకూలం.. ఊహించ‌ని లాభాలు ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved