కడప వైసిపి ఎంపి అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దాంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత మొదలైంది. అభివృద్ధిపై టిడిపి నేతలు చేసిన సవాలుకు వైసిపి కడప ఎంపి ప్రతిసవాలు విసరటంతో సమస్య మొదలైంది. అభివృద్దిపై ప్రధాన ప్రతిపక్షానికి సవాళ్ళు విసరటం, ఎంపి  స్పందించటంతో పోలీసులు రంగంలోకి దిగారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధికి, గడచిన మూడున్నరేళ్ళలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రెడీ అంటూ సతీష్ సవాలు విసిరారు.

టిడిపి నేత సవాలుకు కడప ఎంపి అవినాష్ రెడ్డి స్పందించారు. ఆదివారం సాయంత్రం పులివెందులలోని పూలఅంగళ్ళ ప్రాంతంలో చర్చకు వేదికగా టిడిపి నేతే నిర్ణయించారు. అయితే, ఉదయమే పోలీసులు రంగంలోకి దిగారు. అవినాష్ ను ఇంటి నుండి బయటకు రావటానికి పోలీసులు అనుమతించటం లేదు. ఒక విధంగా పోలీసులు అవినాష్ ను హౌస్ అరెస్టు చేసారు. దాంతో పోలీసు వలయాన్ని చేధించుకుని బయటకు రావటానికి ప్రయత్నించటంతో పోలీసులు అరెస్టు చేశారు.

ఎంపి అరెస్టును నిరసిస్తూ వైసిపి శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. రోడ్లపై ఆందోళనలకు దిగిన కార్యకర్తలపై టిడిపి శ్రేణులు అడ్డుకున్నారు. అంతేకాకుండా చాలా చోట్ల రాళ్ళవర్షం కూడా కురిపించారు. దాంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత మొదలైంది. ఎంపి అవినాష్ ను అరెస్టు చేసిన పోలీసులు పోలీసు స్టేషన్ కు తరలించటంతో నేతలు, కార్యకర్తలందరూ పోలీస్టేషన్ వద్ద భారీగా చేరుకుంటున్నారు.

పులివెందుల పూల అంగళ్ళ సర్కిల్ వద్ద ఉద్రిక్తత. వందల సంఖ్యలో చేరుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు. తీవ్రమైన గందరగోళం. ఈలలు కేకలతో అట్టుదుకుతున్న సర్కిల్. ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్న కార్యకర్తలు. వైసిపి చెందిన ప్రధాన నేతలను హౌస్ అరెస్టు చేయడంతో రోడ్ల పైకి వచ్చిన కార్యకర్తలు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు. ఒకరిపై మరొకరు రాళ్ళు విసురుకుంటున్న కారకర్తలు, రాళ్ళదాడుల్లో ఎస్ఐకి గాయాలు.