అమరావతి: అమరావతి ఉండవల్లిలోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. 

జై జగన్ జై జగన్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. వైసీపీ కార్యకర్తల నినాదాలతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు మరింతగా నినాదాలు చేశారు. అనంతరం ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగారు. వాగ్వాదం కాస్త తీవ్రమవ్వడంతో దాడులకు దిగారు. 

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ సిబ్బంది వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇకపోతే అల్లర్లు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, వైయస్ జగన్ నివాసాలతోపాటు చంద్రబాబు నివాసం వద్ద భారీ భద్రత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ.