ఏపీలో టెంపుల్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య విమర్శల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. చంద్రబాబు, లోకేశ్‌ కనుసన్నుల్లోనే వైసీపీ ఆరోపిస్తోంది. అయితే జగన్ పాలనలో ప్రజలకే కాదు.. దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని విమర్శిస్తోంది టీడీపీ.

మరోవైపు రేపు చంద్రబాబు విజయనగరం వెళ్లనున్నారు. రాములవారి విగ్రహం ధ్వంసమైన రామ తీర్థానికి రేపు ఉదయం 11.30 నిమిషాలకు చంద్రబాబు చేరుకోనున్నారు. అటు చంద్రబాబు, లోకేశ్ కనుసన్నల్లోనే రామతీర్ధంలో రాములవారి విగ్రహం ధ్వంసమైందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.

ఘటన జరగడానికి ముందు రోజు కొండపైకి టీడీపీకి చెందిన వారు వెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు. అందుకు ఆధారాలు కూడా వున్నాయిని.. బాధ్యులకు శిక్ష తప్పదని హెచ్చరించారు విజయసాయి. చంద్రబాబు ఒక కుట్రదారుడని ఆరోపించారు.

మరోవైపు ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను ఖండించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జగన్ పాలనలో ప్రజలకే కాదు.. దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు.

దేవాదాయ శాఖకు మంత్రి ఉన్నాడో, లేడో కూడా అర్ధం కావడం లేదని అచ్చెన్న ఎద్దేవా చేశారు. మరోవైపు రాష్ట్రంలో ప్రజలకే కాదు... కనీసం గుళ్లో ఉన్న దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు విమర్శించారు.

రాష్ట్రంలో దేవాలయాల మీద దాడులు నిత్యకృత్యం కావడం దురదృష్టకరమన్నారు.  శుక్రవారం నాడు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ అలసత్వం వల్లే ఈ దాడులు చోటు చేసుకుంటున్నాయన్నారు. 

రాజమండ్రిలో విఘ్నేశ్వర ఆలయంలోసుబ్రమణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని విధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న ఈ దురాగతాల నివారణకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.