Asianet News TeluguAsianet News Telugu

జగన్ కు భర్త్ డే గిప్ట్ గా నకిలీ బ్రాండ్ మద్యం బాటిల్..: తెలుగు మహిళల వినూత్న నిరసన

తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నాయకురాల్లు సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నకిలీ బద్యం బాటిల్ ను సీఎం జగన్ కు గిప్ట్ గా పంపించారు. 

telugu desham party women leaders protest at mangalagiri
Author
Mangalagiri, First Published Dec 21, 2021, 5:22 PM IST

మంగళగిరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jaganmohan reddy birthday) పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం (TDP) నాయకులు వినూత్న నిరసన తెలియజేసారు. వైసిపి ప్రభుత్వం అమ్ముతున్న నకిలీ బ్రాండ్ మద్యం బాటిల్ ను ముఖ్యమత్రికి కానుకగా పంపించారు తెలుగు మహిళా నేతలు. అలాగే మంగళగిరి (mangalagiri)లో వైన్ షాప్ వద్ద తెలుగు మహిళా నేతలు, స్ధానిక మహిళలు ఆందోనలకు దిగారు. మద్యం సీసాలు ద్వంసం చేసి ముఖ్యమంత్రి జగన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  

ఈ సందర్భంగా  తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే  మద్యపాన నిషేదం చేస్తానని జగన్ రెడ్డి మహిళల తలలు నిమిరి, బుగ్గలు రుద్ది మరీ చెప్పారని గుర్తుచేసారు. ఇలా మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేదం చేయకపోగా దేశంలో ఎక్కడా లేని కల్తీ బ్రాండ్లు తెచ్చి గెలిపించిన మహిళల తాలిబొట్లతో చెలగామాడుతున్నారని మండిపడ్డారు.  

Video

''ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కమీషన్లకు కక్కుర్తిపడి నకిలీ బ్రాండ్లు అమ్ముతూ పేదల ప్రాణాలు తీస్తున్నారు.  వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేస్తూ ఉత్పత్తి చేసే బ్రాండ్లనే ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం విక్రయిస్తోంది'' అని ఆరోపించారు.

''అప్పుల కోసం మహిళల తాళి బొట్లు తాకట్టు పెట్టారు జగన్ రెడ్డి. చివరకు కమీషన్ల కోసం కల్తీ మద్యం అమ్ముతూ మహిళల తాలిబొట్లు తెంచుతున్నారు. ‎జగన్ రెడ్డి తెచ్చిన నకిలీ బ్రాండ్లు ‎తాగిన వారు  కిడ్నీ వ్యాదులు, ఒళ్లు వాపులు, కడుపులో మంటతో బాధపడుతు చాలామంది చనిపోతున్నారు. వారి పిల్లలు అనాధలుగా, భార్యలు వితంతవులుగా మారిపోతున్నారు. రాష్ట్రంలో  విడో పించన్లు పెరగడానికి‎ వైసీపీ ప్రభుత్వం అమ్ముతున్న  నకిలీ బ్రాండ్లే  కారణం. జగన్ రెడ్డికి పుట్టిన రోజు నాడైనా మహిళల బాధపట్ల ‎ ఆయనకు కనువిప్పు కలగాలి.  నకిలీ బ్రాండ్లు వెంటనే నిషేదించాలి. లేకపోతే అన్ని షాపుల్లోని నకిలీ  బ్రాండ్లు సీసాలు పగలగొడతాం'' అని అనిత హెచ్చరించారు. 

read more  చంద్రబాబును తిట్టొద్దంటే... మద్యం సీసాలతో తల పగలగొట్టి, నిప్పంటించి.. ఇంత ఘోరమా..: లోకేష్ సీరియస్ (Video)

''పానిపూరి బండ్ల దగ్గర సైతం డిజిటల్ చెల్లింపులు జరుగుతుంటే మద్యం షాపుల్లో ఎందుకు డిజిటల్ లావాదేవీలు నిర్వహించడం లేదు? ‎మీ బ్లాక్ మనీ కోసం కాదా? జీఎస్టీ, ట్యాక్సులు కట్టకుండా వేల కోట్లు దోచుకుంటున్నారు. మద్యం ధరలు పెంచటం,  తగ్గించడం జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ చర్యలకు నిదర్శనం'' అని మండిపడ్డారు. 

''జగన్ రెడ్డి ధనదాహంతో పచ్చని కుటుంబాలను నాశనం చేస్తున్నారు. మహిళల తాళిబొట్లు తెంచుతూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. మద్యపాన నిషేదం చేస్తానని చెప్పిన వ్యక్తి మద్యంపై టార్గెట్లు విధించి మరీ అమ్మటం సిగ్గుచేటు.  ఏడాదికి మద్యంపై ప్రభుత్వ ఖజానాకు రూ. 30 వేల కోట్లు రాబట్టుకుంటున్నారు. పండుగ సీజన్ లో ఆదాయం పెంచుకునేందుకు మద్యం రేట్లు తగ్గించారు'' అని తెలిపారు.

''నెలకు సుమారు 25 నుంచి 30 లక్షల మద్యం కేసులు అమ్ముతూ రాష్ట్రంలో మద్యం ఏరులై పారిస్తున్నారు. మద్యంతో పాటు గంజాయి, నాటుసారా వాడకం విపరీతంగా పెరిగింది. 3 దశల్లో మద్యపాన నిషేదం చేస్తామన్నారు కానీ 3 సార్లు మద్యం పాలసీలు తెచ్చారు. మెదటి పాలసీలోనే షాపులు తగ్గించారు తప్ప మిగతా రెండు పాలసీలో షాపుల తగ్గింపుపై ఎందుకు ప్రస్తావించలేదు?'' అని అనిత నిలదీసారు.

read more  నేనేప్పుడూ మంత్రికి విధేయుడినే: బాలినేని ఇంట్లో సుబ్బారావు ప్రత్యక్షం

''మద్యపాన నిషేదం అని చెప్పి ఉన్న మద్యం షాపులు చాలవన్నట్లుగా వాకిన్ స్టోర్ పేరుతో మరో 300 మద్యం షాపులు ఏర్పాటుకు రంగం సిద్దం చేయటం జగన్ రెడ్డి దివాళుకోరుతనానికి నిదర్శనం. జగన్ రెడ్డి కమీషన్ల కోసం కాకుండా ప్రజల ప్రాణాల కోసం ఆలోచించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే మద్యపాన నిషేదం అమలు చేయాలి. లేకపోతే మహిళలే రాష్ట్రంలో వైసీపీని పూర్తిగా నిషేదిస్తారు'' అని వంగలపూడి అనిత హెచ్చరించారు.   

Follow Us:
Download App:
  • android
  • ios