నేనేప్పుడూ మంత్రికి విధేయుడినే: బాలినేని ఇంట్లో సుబ్బారావు ప్రత్యక్షం
సుభాని చేతిలో దాడికి గురైన సుబ్బారావు గుప్తా మంగళవారం నాడు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డికి తాను విధేయుడినేనని ప్రకటించారు. సీఎం జన్మదిన వేడుకల్లో సుబ్బారావు గుప్తా పాల్గొన్నారు.
ఒంగోలు: మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుల చేతిలో గాయపడిన సుబ్బారావు గుప్తా మంగళవారం నాడు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకొంది.మంగళవారం నాడు ఏపీ మంత్రి Balineni Srinivas Reddy ఇంట్లో Subba Rao గుప్తా ప్రత్యక్షమయ్యారు. సీఎం Ys Jagan జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేశారు. కేక్ ను మంత్రికి సుబ్బారావు తినిపించారు. సుబ్బారావుకు మంత్రి కేక్ తినిపించారు. Ongole నుండి కొందరు Ycp నేతలు ఇవాళ ఉదయం Vijayawadaకు సుబ్బారావు గుప్తాను తీసుకెళ్లారు. తనపై దాడి వివరాలను సుబ్బారావు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి వివరించారు. ఆ తర్వాత సీఎం జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సుబ్బారావు గుప్తా మీడియాతో మాట్లాడారు. Subhani అనే వ్యక్తి ఓవరాక్షన్ వలనే ఈ రచ్చకు కారణమని సుబ్బారావు చెప్పారు.తాను మొదటి నుండి రాజకీయాలలో మంత్రి బాలినేని వెంట వున్నానని గుర్తు చేసుకొన్నారు.తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఉన్న పరిస్థితులను బట్టి చేశానన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక ఎవరూ లేరన్నారు. పార్టీని బతికించుకోవాలనే ఆకాంక్షతో ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పారు.మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తనపై దాడి చేయించారనే వార్తలను సుబ్బారావు గుప్తా ఖండించారు.
also read:వైసీపీ నేత సుబ్బారావుపై సుభాని వర్గీయుల దాడి: వద్దని చెప్పానన్న మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి
సుబ్బారావు గుప్తా చేసిన వ్యాఖ్యలపై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు సుభాని సోమవారం నాడు దాడికి దిగారు. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, మంత్రి కొడాలి నాని తీరుతో వైసీపీకి నష్టమని సుబ్బారావు గుప్తా వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత సుబ్బారావు కన్పించకుండా పోయాడు. గుంటూరులోని లాడ్జీలో ఉన్న సుబ్బారావుపై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడడ్డి అనుచరులు దాడికి దిగారు. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుబ్బారావుపై దాడి చేస్తారనే విషయం తెలిసి తాను వారించినట్టుగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.