Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ ఎమ్మెల్యే బూతులు... స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

రాళ్ల దాడిలో గాయపడిన జనసైనికులు, నాయకులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రతి జనసైనికుడు వారికి ధైర్యాన్నిచ్చి బాసటగా నిలవాలని అన్నారు. 
 

janasena chief pawan kalyan release press note on kakinada issue
Author
Hyderabad, First Published Jan 13, 2020, 8:40 AM IST

తనని బూతులు తిట్టిన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఆయన... అక్కడి నుంచి డైరెక్ట్ గా కాకినాడకే వస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.

కాగా..  ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అభ్యంతరకంగా మాట్లాడటాన్ని వ్యతిరేకిస్తూ.. జనసే కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటి వద్ద ఆదివారం ఆందోళన చేశారు. ఈ క్రమంలో జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్త పరస్పర దాడులకు దారి తీసింది. ఈ దాడుల్లో ఇరు వార్గాల వారు గాయాలపాలయ్యారు.

Also Read వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య రాళ్ల దాడి: కాకినాడలో ఉద్రిక్తత, పలువురికి గాయాలు.

ఇదిలా ఉండగా...ఈ ఘటనపై పవన్ ఓ ప్రకటన చేశారు. రాళ్ల దాడిలో గాయపడిన జనసైనికులు, నాయకులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రతి జనసైనికుడు వారికి ధైర్యాన్నిచ్చి బాసటగా నిలవాలని అన్నారు. 

అరాచక శక్తులతో దాడి చేయిస్తే వెనకడుగు వేస్తారనుకోవద్దని చెప్పారు.  సభ్య సమాజం ఛీత్కరించుకొనే పదజాలంతో ప్రసంగం చేసిన ప్రజా ప్రతినిధి తీరుపై నిరసన తెలియచేస్తున్న జనసేన కార్యకర్తలు, నాయకులపై వైసీపీ కార్యకర్తలు రాళ్ళ దాడికి పాల్పడటం అత్యంత దురదృష్టకరమని  పవన్ పేర్కొన్నారు.

 ఒక ప్రజా ప్రతినిధి బాధ్యత లేకుండా అసభ్యకరంగా మాట్లాడిన విధం చూసిన ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారన్నారు. తప్పుని తప్పు అని చెబుతున్నవారిపై అరాచక శక్తులతో దాడులు చేయిస్తే జన సైనికులు వెనకడుగు వేస్తారనుకోవద్దన్నారు.  అధర్మాన్ని ఖండించడమే జనసేన విధానమన్నారు.

రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్న ఆ ప్రజా ప్రతినిధిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. పక్షపాతం లేకుండా ఇరు వర్గాలతో చర్చించి శాంతియుత పరిస్థితులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. తమ జనసేన కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం చేసి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తే ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా కాకినాడకు వచ్చి వారికి బాసటగా ఉంటానని చెప్పారు.

రాళ్ళ దాడిలో గాయపడిన జన సైనికులు, నాయకులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ప్రతి జన సైనికుడు వారికి ధైర్యాన్ని అందించి అండగా నిలవాలి అని పవన్ కళ్యాణ్ కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios