కర్నూలు: కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోటో ఉండటం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోటో పెట్టారు. 

ఒకవైపు శ్రీశైలం నియోజకవర్గ ఇంచార్జ్ శిల్పా చక్రపాణి రెడ్డి, మరో వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్యలో వైఎస్ జగన్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీని నంద్యాల బండి ఆత్మకూరు రహదారిలో సంతజూటూరు వద్ద ఏర్పాటు చేశారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఆ ఫ్లెక్సీని ఆశ్చర్యంగా చూస్తున్నారు.