టీచర్స్ డే తర్వాతిరోజే ఘోరం... రైలు కిందపడి రెండు ముక్కలైన ఉపాధ్యాయురాలి శరీరం
ఉపాధ్యాయ ధినోత్సవం తర్వాతి రోజే ఓ టీచర్ ఘోర ప్రమాదానికి గురయ్యింది. కదులుతున్న రైల్లోంచి దిగేందుకు ప్రయత్నించిన మహిళా టీచర్ ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఘటన గుడివాడలో చోటుచేసుకుంది.

గుడివాడ : కదులుతున్న రైల్లోంచి దిగేందుకు ప్రయత్నించి ప్రాణాలమీదకు తెచ్చుకుందో మహిళ. పట్టాలపై పడిన మహిళ పైనుండి రైలు దూసుకెళ్లడంతో శరీరం రెండుగా విడిపోయింది. నడుము కింద భాగం తెగిపోయినా మహిళ ప్రాణాలతోనే వుంది.ఈ దుర్ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటుచేసుకుంది.
రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుడివాడకు చెందిన జాహ్నవి సాయిశ్రీ (23) పుట్టపర్తిలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.నిన్న(సోమవారం) ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె బుధవారం స్వస్థలం గుడివాడకు బయలుదేరింది. ఇవాళ ఉదయం మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఎక్కిన ఆమె గుడివాడకు చేరుకుంది. అయితే సాయిశ్రీ రైల్వేస్టషన్లో దిగడం ఆలస్యం కావడంతో ట్రైన్ ముందుకు కదిలింది. దీంతో రన్నింగ్ రైల్లోంచి దిగేందుకు ప్రయత్నించి సాయిశ్రీ ప్రమాదానికి గురయ్యింది.
గుడివాడ రైల్వేస్టేషన్ దాటిపోయిందన్న కంగారులో కదులుతున్న రైల్లోంచి దిగుతుండగా సాయిశ్రీ కాలుజారి పట్టాలపై పడిపోయింది. ఆమె నడుము పైపుండి రైలు వెళ్లడంతో శరీరం రెండు భాగాలయ్యింది. నడము కింది భాగం తెగిపోయి అపస్మారక స్థితిలో పడివున్న ఆమెను రైల్వే పోలీసులు గుడివాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. సాయిశ్రీ పరిస్థితి ప్రస్తుతం విషమంగా వున్నట్లు సమాచారం.
Read More నల్గొండలో విషాదం: ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు మృతి
ఉపాధ్యాయ దినోత్సవం తర్వాతిరోజే ఇలా టీచర్ సాయిశ్రీ ఘోర ప్రమాదానికి గురవడం సాటి టీచర్లను కలచివేస్తోంది. ఇంటికి వస్తామన్న కూతురుకోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు ప్రమాదం గురించి తెలుసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమదంపై గుడివాడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.