Asianet News TeluguAsianet News Telugu

కోడెల శివరామ్ కు టీడీపీ బుజ్జగింపులు: జీవీ, నక్కా ముందు టీడీపీ శ్రేణుల నిరసన

సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జీగా  కన్నా లక్ష్మీనారాయణను నియమించడంపై   కోడెల శివరాం అసంతృప్తికి లోనయ్యారు.  అనుచరులతో సమావేశమౌతున్నారు. 

TDP  Workers  Protest  infront of  former  minister  Nakka Anand Babu and  YV Anjaneulu lns
Author
First Published Jun 2, 2023, 3:53 PM IST

గుంటూరు:   కోడెల శివరాంతో  మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్యే  జీవీ ఆంజనేయులు  శుక్రవారంనాడు భేటీ అయ్యారు. కోడెల శివరామ్ ను బుజ్జగించేందుకు  టీడీపీ  నాయకత్వం  చర్యలు చేపట్టింది.సత్తెనపల్లి అసెంబ్లీ  స్థానానికి  టీడీపీ  ఇంచార్జీగా   మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను  నియమించడంతో   కోడెల శివరాం  అసంతృప్తితో  ఉన్నారు. తన అనుచరులతో  సమావేశాలు  నిర్వహిస్తున్నారు.

ఇవాళ  కోడెల శివరాం  వద్దకు   మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు  రావడంతో  కోడెల  శివరాం  వర్గీయులు  టీడీపీ నేతలకు  అడ్డుపడ్డారు.  శివరామ్ కు  న్యాయం చేయాలని డిమాండ్  చేశారు.కోడెల శివరాంతో    ఈ ఇద్దరు నేతలు  చర్చించారు.  ఏ పరిస్థితుల్లో  పార్టీ నాయకత్వం  సత్తెనపల్లి  ఇంచార్జీగా  కన్నా లక్ష్మీనారాయణను నియమించిందో  నేతలు  వివరించారు. మరోవైపు తన వాదనను  కోడెలశివరాం కూడ పార్టీ నేతల  వద్ద  విన్పించారు.  

కాంగ్రెస్ లో  సుదీర్థకాలం  పనిచేసిన  కాలంలో  టీడీపీని ఇబ్బందులకు  కన్నా లక్ష్మీనారాయణ  గురి చేశాడని  కోడెల శివరాం  గుర్తు  చేశారు.  పార్టీ  కోసం  పనిచేసిన కోడెల  కుటుంబంపై  పార్టీ  ఏ రకంగా  న్యాయం  చేస్తుందని  శివరాం  వర్గీయులు  ప్రశ్నిస్తున్నారు. 

also read:అంబటిపై పోటీకి కన్నా: సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జీగా మాజీ మంత్రి నియామకం

కోడెల శివరాంతో  చర్చలు  పూర్తైన తర్వాత  వెళ్లిపోతున్న జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుల కార్లకు  కోడెల శివరాం  వర్గీయులు  అడ్డు పడ్డారు.కోడెల శివరాంకు  ఏం న్యాయం చేశారో చెప్పాలని కోరారు. కోడెల శివప్రసాదరావు  మరణించిన తర్వాత   సత్తెనపల్లి  అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ  ఇంచార్జీని  నియమించలేదు. గత కొంతకాలంగా  కోడెల శివరాం సహ మరో ముగ్గురు నేతలు  ఇంచార్జీ  పదవి కోసం  ప్రయత్నిస్తున్నారు. కానీ టీడీపీ నాయకత్వం  కన్నా లక్ష్మీనారాయణకు  ఇంచార్జీ  బాధ్యతలు అప్పగించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios