Asianet News TeluguAsianet News Telugu

అంబటిపై పోటీకి కన్నా: సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జీగా మాజీ మంత్రి నియామకం

సత్తెనపల్లి  టీడీపీ  ఇంచార్జీగా  కన్నా లక్ష్మీనారాయణను నియమించింది టీడీపీ.   ఈ మేరకు  ఇవాళ  టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటనను విడుదల  చేశారు.

TDP Appoints Kanna Lakshminarayana As Sattenapalli TDP Incharge lns
Author
First Published May 31, 2023, 3:35 PM IST

గుంటూరు: సత్తెనపల్లి  టీడీపీ  ఇంచార్జీగా  కన్నా లక్ష్మీనారాయణను  నియమించింది  ఆ పార్టీ.  ఈ మేరకు  టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు  అచ్చెన్నాయుడు  బుధవారంనాడు  ఓ ప్రకటనలో  ఈ విషయాన్ని తెలిపారు. 

 సత్తెనపల్లి అసెంబ్లీ  ఇంచార్జీ పదవికి  మాజీ మంత్రి కోడెలశివరాం,  మాజీ ఎమ్మెల్యే  వైవీ ఆంజనేయులు .,శౌరయ్య, మల్లిబాబు  పోటీ పడ్డారు. అయితే  మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వైపే టీడీపీ నాయకత్వం మొగ్గుచూపింది.  2014, 2019  ఎన్నికల్లో  ఈ స్థానం నుండి  కోడెల శివప్రసాదరావు  టీడీపీ అభ్యర్ధిగా  పోటీ  చేశారు.  2014  లో  సత్తెనపల్లి నుండి  కోడెల శివప్రసాదరావు  టీడీపీ అభ్యర్ధిగా  విజయం సాధించారు.  2019లో  కోడెల శివప్రసాదరావు  వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి అంబటి రాంబాబు చేతిలో  ఓటమి పాలయ్యారు.  ఆ తర్వాత  కొన్ని రోజుల  కోడెల శివప్రసాదరావు  ఆత్మహత్య  చేసుకున్నాడు. ఆ తర్వాత  ఈ నియోజకవర్గానికి  టీడీపీ ఇంచార్జీ లేరు.  దీంతో  ఇంచార్జీ పదవి కోసం    నేతలు పోటీ పడ్డారు.    అయితే  ఇటీవలే  పార్టీలో  చేరిన  కన్నా లక్ష్మీనారాయణను  సత్తెనపల్లి  ఇంచార్జీగా  నియమించింది టీడీపీ.

కన్నా లక్ష్మీనారాయణ  గతంలో  పెద్దకూరపాడు,  గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల నుండి  విజయం సాధించారు.  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  మంత్రిగా  పనిచేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  సుధీర్ఘకాలం పాటు కాంగ్రెస్ లో పనిచేశారు ఆ తర్వాత  పరిణామాల నేపథ్యంలో   ఆయన  బీజేపీలో  చేరారు.  బీజేపీ  ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా  పనిచేశారు. బీజేపీని వీడి  ఇటీవల  కాలంలో  కన్నా లక్ష్మీనారాయణ  టీడీపీలో  చేరారు.  

కాపు సామాజిక వర్గానికి  చెందిన  కన్నా లక్ష్మీనారాయణ ను  సత్తెనపల్లి  నియోజకవర్గం నుండి  వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు.  ప్రస్తుతం  ఇదే  అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్థి  అంబటి రాంబాబు  ఎమ్మెల్యేగా  ఉన్నారు.   అంబటి రాంబాబుది  కూడా కాపు సామాజిక వర్గమే.సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జీగా  ఇంతకాలం పాటు  ఆశించిన  నేతలు  రానున్న రోజల్లో  కన్నా లక్ష్మీనారాయణకు ఏ మేరకు సహకరిస్తారో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios