టిడీపీ కి ఓటమీ భయం పట్టుకుంది అంబటి రాంబాబు ఎన్నీకల నగారా మోగగానే అభివృద్ది మంత్రం జపిస్తుంది. నంద్యాల్లో విజయం మాదే అన్నా అంబటీ
నంద్యాల ఎన్నికలో టిడీపీకి ఓటమి భయం పట్టుకుందా.. అంటే అవుననే అంటున్నారు వైసీపీ నేతలు. ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయం సీఎం చంద్రబాబుకు పట్టుకుందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పెర్కోన్నారు. అందుకే బాబు ఉప ఎన్నికల్లో అభివృద్ధి మంత్రం జపిస్తున్నారని ఆయన విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
నేడు ఎన్నికల నగారా మోగగానే చంద్రబాబు అమరావతి కోసం చూపించిన గ్రాఫిక్స్ జిమ్మిక్‌లు ప్రారంభించారని రాంబాబు ఎద్దేవా చేశారు.చంద్రబాబు మూడేళ్ల పాలనలో ఆంధ్రలో అభివృద్ది ఏమాత్రం లేదని, ప్రజలను మభ్యపెట్టడానికి టిడీపీ పనులు ప్రారంభించిందని ఆయన ఆరోపించారు. రోడ్ల వెడల్పంటు శంకుస్దాపనలు చేస్తున్నారని విమర్శించారు. నాడు శిల్పామోహాన్ రెడ్డి, బాబును రోడ్ల వేడల్పు గురించి నిధులు అడిగితే డబ్బులేంటు హేళన చేశారని రాంబాబు అన్నారు. అందుకు ఆధారాలను కూడా ఆయన మీడియాకు వీడియో రూపంలో చూపించారు. నంద్యాల అభివృద్ధిని కోరుకునేది శిల్పా మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ లు మాత్రమేనని పేర్కొన్నారు.
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే శిల్పా మోహన్‌రెడ్డిపై కుట్రలు చేశారని ఆరోపించారు. 2014లో శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌పై ఏ లాయర్ సంతకం చేశారో, ఇప్పుడు అదే న్యాయవాది సంతకం చేశారని వెల్లడించారు. ఓటమి భయంతో నామినేషన్‌పై నానా రభస చేస్తున్నారని విమర్శించారు. ఉప ఎన్నికలో ఓటు ద్వారా చంద్రబాబుకు, ఆయన మంత్రి వర్గానికి తగిన గుణపాఠం చెప్పాలని నంద్యాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైసీపి నంద్యాల్లో తప్పకుండా విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
